కాంగ్రెసోళ్లు బట్టేబాజ్ గాళ్లు, దొంగలు: మంత్రి తలసాని

Published : Oct 06, 2018, 07:46 PM IST
కాంగ్రెసోళ్లు బట్టేబాజ్ గాళ్లు, దొంగలు: మంత్రి తలసాని

సారాంశం

కాంగ్రెస్ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతలు బట్టేబాజ్ గాళ్లు దొంగ మాటలు మాట్లాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అవినీతి సామ్రాట్ లు అంటూ దుయ్యబుట్టారు. రాష్ట్రం నుంచి చూస్తే దేశం వరకు కాంగ్రెస్ పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్ అంటూ ధ్వజమెత్తారు. 

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతలు బట్టేబాజ్ గాళ్లు దొంగ మాటలు మాట్లాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అవినీతి సామ్రాట్ లు అంటూ దుయ్యబుట్టారు. రాష్ట్రం నుంచి చూస్తే దేశం వరకు కాంగ్రెస్ పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్ అంటూ ధ్వజమెత్తారు. 

టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చెయ్యలేదంటున్న కాంగ్రెస్ నేతలు నిజంగానే బట్టేబాజ్ గాళ్లు అంటూ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పదవులకు రాజీనామాలు చెయ్యకుండా ఆంధ్రా ముఖ్యమంత్రులకు సలాం కొట్టింది కాంగ్రెస్ నేతలు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేసిన కాంగ్రెసోళ్లు కత్తులు తిప్పుతారా...మీ ముఖాలకు కత్తులు ఒకటి అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

మరోవైపు డబుల్ బెడ్రూం పథకం నిరంతర ప్రక్రియ అని హైదరాబాద్‌లో లక్ష ఇళ్లను కట్టిస్తున్నామని తలసాని స్పష్టం చేశారు. తన వెంట వస్తే చూపిస్తానని ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరారు. యువతను కాంగ్రెస్ నేతలు రెచ్చగొడుతున్నారని, ప్రజలను మభ్యపెట్టడానికే ఇంటికో ఉద్యోగమంటున్నారని విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu