ప్రధాని మోదీ నిలబడే చోట కూడా బీఆర్ఎస్ పోటీ చేస్తుంది.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

By Sumanth KanukulaFirst Published Oct 5, 2022, 3:12 PM IST
Highlights

తెలంగాణ ప్రజల మాదిరిగానే దేశ ప్రజలు బతకాలన్నదే తమ నాయకుడు, సీఎం కేసీఆర్ ఆలోచనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఎలా అయితే మారిందో.. అదే విధంగా దేశ భవిష్యత్తు కూడా మారుతుంద‌ని అన్నారు. 

తెలంగాణ ప్రజల మాదిరిగానే దేశ ప్రజలు బతకాలన్నదే తమ నాయకుడు, సీఎం కేసీఆర్ ఆలోచనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఎలా అయితే మారిందో.. అదే విధంగా దేశ భవిష్యత్తు కూడా మారుతుంద‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ పార్టీ ప్రారంభించినప్పుడు.. అప్పుడు అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారని గుర్తుచేశారు. అయితే వాటిని లెక్కచేయకుండా కేసీఆర్.. అందరిని కలుపుకుని తెలంగాణ తెచ్చారని అన్నారు. ఇప్పుడు తెలంగాణ సంతోషంగా ఉందన్నారు. 

జాతీయ పార్టీలు ఏ విధంగా అయితే పోటీ చేస్తాయో.. అదే విధంగా తమ పార్టీ కూడా పోటీలో నిలుస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ గుజరాత్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ బరిలో నిలిచే చోట కూడా..తమ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు.  

ఇక, తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్.. ఇకపై భారత్ రాష్ట్ర సమితిగా మారనుంది. ఇక, తెలంగాణ భవన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పేరు మార్పు, ఎజెండాను కేసీఆర్.. పార్టీ నేతలకు కేసీఆర్ వివరించారు. ఈ సమావేశంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి, వీసీకే చీఫ్ తిరుమలవలన్ కూడా పాల్గొన్నారు. పార్టీ పేరును మారుస్తూ కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత వారు శుభాకాంక్షలు చెప్పారు. 

ఇక, ఈ రోజు తెలంగాణ భవన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో..  పార్టీ రాజ్యాంగానికి అవసరమైన సవరణలు కూడా చేశారు. పార్టీ పేరు మార్పు, పార్టీ రాజ్యాంగంలో చేసిన సవరణలతో కూడిన తీర్మానాన్ని.. పార్టీ ప్రతినిధి బృందం భారత ఎన్నికల సంఘానికి సమర్పించనుంది. పార్టీ పేరును మార్చాలని.. జాతీయ పార్టీగా నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తును కూడా సమర్పించనుంది. 

click me!