కరోనా మృతదేహానికి దగ్గరుండి అంత్యక్రియలు...మానవత్వాన్ని చాటుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

By Arun Kumar PFirst Published Aug 11, 2020, 10:35 AM IST
Highlights

తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా కరోనాతో మరణించిన ఓ వ్యక్తి అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారు రాష్ట్ర అబ్కారి, క్రీడా , పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్.

మహబూబ్ నగర్: కరోనా... ఈ పేరు వింటేనే చాలు ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతోంది. మనుషుల ప్రాణాలను హరిస్తున్న ఈ మహమ్మారి అదే మనుషుల్లో మిగిలివున్న కాస్త మానవత్వాన్ని కూడా చంపేసింది. బయటివారు కాదు సొంత కుటుంబసభ్యులు కరోనాబారిన పడ్డా పట్టించుకోవడం లేదు. ఇక  కరోనాతో ఎవరయినా చనిపోతే వారికి అనాధల మాదిరిగా అంత్యక్రియలు చేయాల్సిందే. తమవారిని చివరిచూపు చూసుకోడానికి కుటుంబసభ్యులు భయపడుతున్నారు. అలాంటిది తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా కరోనాతో మరణించిన ఓ వ్యక్తి అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారు రాష్ట్ర అబ్కారి, క్రీడా , పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్.

మనం ప్రతిరోజు ప్రసార మాద్యమాల్లో కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని అసుపత్రిలోనే వదలివెళ్ళిన బందువులు, అంత్యక్రియలకు వెనుకాడుతున్న  కుటుంబ సభ్యులు లాంటి వార్తలు వింటూనే వున్నాం. ఇలాంటి అమానుష ఘటనల గురించి విని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా చలించిపోయారు. ఎలాగైనా ప్రజలలో అవగాహనను తీసుకోచ్చేందుకు స్వయంగా మంత్రే రంగంలోకి దిగారు.   

ఈ క్రమంలోనే కరోనాతో చనిపోయిన వ్యక్తి అంతిమ సంస్కారాలలో కోవిడ్ నిబందనలను పాటిస్తూ ఆయన స్వయంగా పాల్గొన్నారు. పిపిఈ కిట్ ధరించి కరోనాతో మృతుడి అంత్యక్రియలు జరిపారు. 

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ... జన్మనిచ్చిన తల్లదండ్రులు దురుదృష్టవశాత్తు కరోనా బారిన పడి అకాల మృతి చెందితే వారి పిల్లలు కనీసం మానవత్వం చూపకుండా మృతదేహంను తీసుకెళ్లకుండా అసుపత్రిలోనే వదలివేయటం మానవత్వం లేని చర్య గా అభివర్ణించారు. హైదరాబాద్ లోని గాంధీ అసుపత్రిలో మరియు వరంగల్ లో జరిగిన సంఘటన లపై వచ్చిన వార్తా కథనాలపై ప్రజలకు కనువిప్పు కలిగించే విధంగా అవగాహన ను తీసుకోచ్చేందుకు తన వంతు సామాజిక  భాధ్యతగా ఈ అంత్యక్రియల్లో పాల్గొనన్నానని అన్నారు. 

పిపిఈ కిట్టు దరించి కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం కరోనా తో చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలలో పాల్గొన్నానని అన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల భవిష్యత్ కోసం అన్ని త్యాగాలు చేస్తే వారి పిల్లలు కనీసం అంతిమ సంస్కారాలు చేయకుండా, అసుపత్రికి వెళ్ళి చూడకుండా ఉండటం మానవ మృగాలు చర్యగా మంత్రి హెచ్చరించారు. 

ప్రజలందరూ కరోనాతో చనిపోయిన వారి పట్ల మానవత్వం చూపి పిపిఈ కిట్టు దరించి కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం గా అంతిమ సంస్కారాలు జరపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్  పిలుపునిచ్చారు. పిపిఈ కిట్టు దరించి 5 నుంచి 10 మందిలోపు అంతీమ సంస్కారాలలో పాల్గోనటం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని డాక్టర్లు సూచించారని మంత్రి వెల్లడించారు.  

  

click me!