మలక్ పేట ఆస్పత్రిలో దారుణం: ఉరేసుకుని కరోనా పేషంట్ మృతి

Published : Aug 11, 2020, 10:33 AM ISTUpdated : Aug 11, 2020, 11:06 AM IST
మలక్ పేట ఆస్పత్రిలో దారుణం: ఉరేసుకుని కరోనా పేషంట్ మృతి

సారాంశం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. మలక్ పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా వైరస్ రోగి ఒకతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనా వైరస్ రోగి ఒకతను హైదరాబాదులోని మలక్ పేటలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆస్పత్రిలో ఉరేసుకుని మరణించాడు. అతన్ని కరీంనగర్ జిల్లాకు చెందిన రవీందరరాజుగా గుర్తించారు.వారం రోజులుగా అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మానసిక వేదనతో అనత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలోని వార్డు రూంలోనే ఉరేసుకున్నాడు. 

ఇదిలావుంటే, తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 1896 కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82647కు చేరుకుంది. అయితే, హైదరాబాదు ప్రజలకు మాత్రం కాస్తా ఊరట లభిస్తోంది. హైదరాబాదులో గత 24 గంటల్లో 338 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

ఇదిలావుంటే, గత 24 గంటల్లో కరోనా వైరస్ వ్యాధితో 10 మంది మృత్యువాత పడ్డారు. దీంతో తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 645కు చేరకుంది. రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అధికంగానే ఉంది. కొన్ని జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుుతన్న సూచనలు కనిపిస్తున్నాయి.

జిల్లాలవారీగా గత 24 గంటల్లో తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు

ఆదిలాబాద్ 14
భద్రాద్రి కొత్తగూడెం 60
జిహెచ్ఎంసి 338
జగిత్యాల 59
జనగామ 71
జయశంకర్ భూపాలపల్లి 20
జోగులాంబ గద్వాల 85
కామారెడ్డి 71
కరీంనగర్  121
ఖమ్మం 65
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 17
మహబూబ్ నగర్ 58
మహబూబాబాద్ 23
మంచిర్యాల 11
మెదక్ 14
మేడ్చెల్ మల్కాజిగిరి 119
ములుగు 23
నాగర్ కర్నూలు 7
నల్లగొండ 54
నారాయణపేట 13
నిర్మల్ 12
నిజామాబాద్ 42
పెద్దపల్లి 66
రాజన్న సిరిసిల్ల 38
రంగారెడ్డి  147
సంగారెడ్డి  49
సిద్ధిపేట 64
సూర్యాపేట 32 
వికారాబాద్ 21
వనపర్తి 28
వరంగల్ రూరల్ 35
వరంగల్ అర్బన్ 35
యాదాద్రి భువనగిరి 24
మొత్తం 1896

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu