అవసరమైతే వారిని నగర బహిష్కరణ చేస్తాం: పబ్ యజమానులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్

Published : Apr 09, 2022, 02:40 PM IST
అవసరమైతే వారిని నగర బహిష్కరణ చేస్తాం: పబ్ యజమానులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్

సారాంశం

బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్‌ల ప్రతినిధులతో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, అధికారులు, పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్‌ల ప్రతినిధులతో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, అధికారులు, పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల కోసం ప్రాణాలకు తెగించి సాధించుకున్న రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి కానీ పేరు చెడగొట్టొద్దన్నారు. తెలంగాణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగొద్దని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టుగా చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలు చేసేవారెవరైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. సొంత పార్టీ నేతలున్నా వదిలిపెట్టొద్దని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టుగా తెలిపారు. పబ్‌లలో డ్రగ్స్ అమ్మితే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. నగరంలోని 61 పబ్‌లపై ప్రత్యేక నిఘా ఉంటుందని మంత్రి వివరించారు.

పబ్‌లలో డ్రగ్స్‌ వ్యాపారం చేసేవారు తెలంగాణ వదిలి వెళ్లిపోవడం మంచిదన్నారు. చట్టంను ఉపయోగించి అవసరమైతే నగర బహిష్కరణ చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని పబ్ యజమానులకు ఇదే చివరి హెచ్చరిక అని స్పష్టం చేశారు. అటువంటి వారి పబ్ లైసెన్సులు రద్దు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. డబ్బే ప్రధానంగా దందా చేయాలనుకేవారిని వదిలిపెట్టమని చెప్పారు. అవసరమైతే రాష్ట్రంలో పబ్స్ లేకుండా చేస్తామని అన్నారు. నియమ నిబంధనలకు అనుగుణంగా పబ్స్ నడిపించుకోవాలని సూచించారు. మైనర్లను పబ్, బార్లలోకి అనుమతిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు. సమయానికి మించి బార్లు, పబ్‌లు నడిపినా లైసెన్సులు రద్దు చేయనున్నట్టుగా చెప్పారు. కుటుంబంతో కలిసి వస్తే మైనర్లకు అనుమతి ఉందని.. అయితే విడికి కూర్చోవాలని తెలిపారు. 

పబ్‌లలో డీజే శబ్దాలు, టైమింగ్స్ ఉల్లంఘలను తనిఖీ చేయడానికి ఎక్సైజ్, ప్రొహిబిషన్ విభాగం నెల రోజుల పాటు.. రెస్టారెంట్లు, స్టార్ హోటల్స్, పబ్‌లలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టుగా చెప్పారు. నిర్ణీత సమయానికి మించి పబ్బులు నడిపితే ఏరియా అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.

అన్ని పబ్‌లలో CCTVలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక నెల సమయం ఇస్తున్నట్టుగా చెప్పారు. బ్లైండ్ స్పాట్‌లను కవర్ చేసేలా సీసీటీవీ కెమెరాలు ఉండాలన్నారు. కెమెరాలు లేని పబ్‌లు తాత్కాలికంగా మూసివేయబడతాయని  తెలిపారు. CCTV కెమెరాలు అమర్చిన తర్వాత తిరిగి ప్రారంభించుకోవడానికి అనుమతించబడుతుందని చెప్పారు. పబ్ యజమానులు తప్పనిసరిగా సీసీటీవీ సర్వర్‌ను పోలీసు లేదా ఎక్సైజ్ శాఖతో పంచుకోవాలన్నారు. అన్ని పబ్‌లలో తప్పనిసరిగా నెలన్నర ఫుటేజీ స్టోరేజీ ఉండాలన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Weather Update : కనుమ రోజు కనువిందు చేసే వెదర్.. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం
హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu