హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. ప్లాస్టిక్ పరిశ్రమలో భారీగా చెలరేగిన మంటలు..

Published : Apr 09, 2022, 02:03 PM IST
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. ప్లాస్టిక్ పరిశ్రమలో భారీగా చెలరేగిన మంటలు..

సారాంశం

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాటేదాన్ టీఎన్జీవోస్ కాలనీలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి. 

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాటేదాన్ టీఎన్జీవోస్ కాలనీలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ప్లాస్టిక్ కంపెనీని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే పరిశ్రమలో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్