అదే నిజమైతే.. ఆస్తి మొత్తం దానం చేస్తా.. శ్రీనివాస్ గౌడ్ సవాల్

Published : May 03, 2021, 01:01 PM ISTUpdated : May 03, 2021, 01:43 PM IST
అదే నిజమైతే.. ఆస్తి మొత్తం దానం చేస్తా.. శ్రీనివాస్ గౌడ్ సవాల్

సారాంశం

 తన  దగ్గర ఉన్న సర్వే నెంబర్లు తప్పని తేలినా అన్ని పదవులకూ రాజీనామా చేస్తానిన చెప్పారు. బండి  సంజయ్‌ చేసిన ఆరోపణలు నిజం కాకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. 

తన పాస్ బుక్ లో ఉన్న దానికంటే గజం ఎక్కువ స్థలం  ఉన్నా.. తన భూమిని మొత్తం దానం చేసేస్తానని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఇటీవల శ్రీనివాస్ గౌడ్ పై బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆ ఆరోపణలపై శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.

బండి సంజయ్‌ చెప్పిన సర్వే నెంబర్‌లో ఉన్నది పట్టా భూమి కాకుంటే తన మొత్తం ఆస్తినీ దానం చేస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తన  దగ్గర ఉన్న సర్వే నెంబర్లు తప్పని తేలినా అన్ని పదవులకూ రాజీనామా చేస్తానిన చెప్పారు. బండి  సంజయ్‌ చేసిన ఆరోపణలు నిజం కాకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. 

 ఎవడో కాగితం ఇస్తే దాన్ని చదువుతూ చరిత్ర కలిగిన నాయకులపై ఆరోపణలు చేస్తారా? అని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియా సమావేశంలో శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ.. బండి సంజయ్‌ వ్యాఖ్యలు సమాజమే సిగ్గుపడే విధంగా ఉన్నాయన్నారు. 

తెలంగాణ అని ఉచ్చరించాలంటేనే భయపడే రోజుల్లో సంఘాలు పెట్టి కొట్లాడామని, ఆ రోజున రాజీనామాలు చేయమంటే పారిపోయిన బీజేపీ నాయకులెక్కడ.. తామెక్కడని ప్రశ్నించారు. 111 జీవో అమల్లో ఉన్న ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు, అక్రమ వ్యాపారాలు బీజేపీ నేతలు చేయట్లేదా అని నిలదీశారు. తాము కష్టపడి భూమి కొనుక్కున్నామని, అమ్మినోళ్లందరూ బతికే ఉన్నారన్నారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్
Complaint Against YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు| Asianet News Telugu