కొత్త పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన ఈటెల..

By AN TeluguFirst Published May 3, 2021, 12:34 PM IST
Highlights

పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ పెట్టబోతున్నారు అంటూ హడావుడి జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీపై స్పందించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదన్నారు. 

పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ పెట్టబోతున్నారు అంటూ హడావుడి జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీపై స్పందించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదన్నారు. 

నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీ బీఫామ్ ఉంటే కాదని ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యం అన్నారు. తనకు అన్యాయం జరిగిందనే భావన ప్రజల్లో ఉందన్నారు. సుదీర్ఘకాలంగా సీఎం కేసీఆర్ తో కలిసి పనిచేశానని ఈటెల పేర్కొన్నారు. 

2008లో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేశానన్నారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వహించారన్నారు. పార్టీకి నష్టం చేకూర్చే పని ఏనాడూ చేయలేదన్నారు. గత మూడు రోజులుగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు.

కాగా, తాను చావుకైనా సిద్ధపడుతాను గానీ ఆత్మగౌరవాన్ని వదులుకోబోనని ఉద్వాసనకు గురైన మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం అభివృద్ధి కోసమే కాకుండా ఆత్మగౌరవం కోసం కూడా జరిగిందని ఆయన సోమవారం మీడియా సమావేశంలో అన్నారు. 

ఎన్నిసార్లు మీ కలిసి బువ్వ తిన్నాను, ఎన్ని వేల కిలోమీటర్లు మీతో కలిసి నడిచాను, ఉద్యమ సమయంలో మీతో కలిసి నడిచానని ఆయన కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. 
పదవులూ డబ్బులూ ఎప్పుడూ ఉండవని, మానవ సంబంధాలు ఎల్ల కాలం ఉంటాయని గుర్తుంచుకోవాలని ఆయన కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. మీ కోసం తాను కొట్టాడిన సందర్భాలు మీకు గుర్తుకు రావాలని ఆయన అన్నారు. 

తనపై అసంతృప్తికి కేసీఆర్ కు వేరే కారణాలు ఉన్నాయని, చాలా జరిగాయని, అవన్నీ ఇప్పుడు చెప్పబోనని ఆయన అన్నారు. ఎన్ని దిగమింగానో మీకు తెలుసునని ఆయన కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే ప్రజలు సహించబోరని ఆయన అన్నారు. 

తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ఘంగా ఉన్నానని, హుజూరాబాద్ ప్రజలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. కేసీఆర్ టీఆర్ఎస్ బీ ఫారం ఇచ్చారు కాబట్టి తాను రాజీనామా చేయాలని అడగవచ్చునని, కానీ తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఓసారి తన నియోజకవర్గం ప్రజలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆయ చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రం వస్తుందనీ... తాము ఎమ్మెల్యేలమూ మంత్రులమూ అవుతామని కేసీఆర్ తో రాలేదని, తెలంగాణ ప్రజల కోసం వచ్చామని, 19 ఏళ్ల పాటు కేసీఆర్ తో కలిసి నడిచానని ఆయన చెప్పారు.  తనకు సంబంధంలేని భూములపై తన మీద ఎలా విచారణ జరుపుతారని ఆయన అన్నారు. జమున హాచరీస్ చైర్మన్ గా తన బార్య ఉన్నారని అన్నారు. తాను టీఆర్ఎస్ లో చేరిన తర్వాత తన భార్య,కుమారుడు, బంధువులు మాత్రమే వ్యాపారాలు చేశారని ఆయన చెప్పారు.

click me!