రోడ్డుపక్కన మొక్కజొన్న పొత్తులు కొన్న సీతక్క... మంత్రిగారి సింప్లిసిటీకి ఫిదా..!

By Arun Kumar P  |  First Published Jan 12, 2024, 11:43 AM IST

మంత్రి సీతక్క మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. మంత్రిగా ఉన్నత హోదాాలో వున్నా సామాన్య మహిళ మాదిరిగానే ప్రజలతో మమేకం అయ్యారు. 


ఆదిలాబాద్ : ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ... తన మంచిమనసు, సేవాగుణంతో ప్రజల్లో క్రేజ్ సంపాదించుకున్న నాయకురాలు. ఎమ్మెల్యేగానే కాదు రాష్ట్ర మంత్రిగా ఉన్నత పదవిలో వున్నా ఏమాత్రం దర్పం ప్రదర్శించకుండా సామాన్యులతో మమేకం  అవుతుంటారు. అందుకే ఆమెను ప్రజలంతా సీతక్కా అని ప్రేమగా పిలుచుకుంటారు. ఆమె ఎంత  నిరాడంబరంగా వుంటారో తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో మరోసారి బయటపడింది. 

నిన్న(గురువారం) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. రోజంతా జిల్లాలోనే పర్యటించనున్న నేపథ్యంలో మంత్రికి మార్లవాయి గ్రామస్తులు భోజనం ఏర్పాటుచేసారు. ఈ క్రమంలోనే గ్రామస్తులు చూపిన ప్రేమకు ముగ్దురాలయిన సీతక్క వారితో కలిసే నేలపై కూర్చుని భోజనం చేసారు. మంత్రి సింప్లిసిటీని చూసి ఆమె వెంటున్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఆశ్చర్యపోగా గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేసారు.

Latest Videos

అంతకుముందు కడెం నుండి మార్లవాయికి వెళుతుండగా రోడ్డుపక్కన మొక్కజొన్న కంకులు అమ్ముకుంటున్న మహిళను గమనించారు సీతక్క. వెంటనే తన కాన్వాయ్ ని ఆపి ఆ మహిళ వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఆ మొక్కజొన్న కంకులను అడిగిమరీ కాల్పించుకున్న మంత్రి  అక్కడే తిన్నారు. చాలా టేస్టీగా వున్నాయని చెప్పి ఆమె వద్ద ఉన్న కంకులన్నింటినీ కొనుగోలు చేసారు. 

 Also Read ఇది ఆర్టిసి వారి పాట ..! పందెంకోడిని వేలం వేస్తున్న టీఎస్ ఆర్టిసి

ఇలా మంత్రి హోదాలో వుండికూడా సామాన్య మహిళలా వ్యవహరించి సింప్లిసిటీని చాటుకున్నారు సీతక్క. మంత్రి తమతో మమేకం కావడంతో ప్రజలు కూడా ఆనందించారు. ఇలా తన నిరాడంబరతో మరోసారి వార్తల్లో నిలిచారు సీతక్క. 
 

click me!