మొదటిసారి హైదరాబాద్ లో ఓటు వేస్తున్నా.. సత్యవతి రాథోడ్

By telugu news teamFirst Published Dec 1, 2020, 12:28 PM IST
Highlights

పోలింగ్ స్టేషన్ లో సాధారణ ఓటరు వలె క్యు లైన్ లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన  అనంతరం అక్కడి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనం సంగీతా యాదవ్ ను అభినందించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 7గంటలకే ఓటింగ్ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా..తాజాగా తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్లో నేడు ఖైరతాబాద్ సర్కిల్,  సోమాజిగూడ వార్డు నెంబర్ 97,  సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ వద్ద పోలింగ్ నెంబర్ 3 లో సత్యవతి రాథోడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్ లో సాధారణ ఓటరు వలె క్యు లైన్ లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన  అనంతరం అక్కడి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనం సంగీతా యాదవ్ ను అభినందించారు.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవాలని, హైదరాబాదు అభివృద్ధిలో భాగం కావాలని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వాడుకొని బాధ్యతగా ఓటేసి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని  కోరారు.

హైదరాబాదులో మొదటిసారి తన ఓటును వేస్తున్నానీ, చాలా సంతోషంగా ఉందన్నారు. అదే విధంగా హైదరాబాద్లో ఓటర్లుగా ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని హైదరాబాద్ అభివృద్ధికి పాటు వాడే వారిని గుర్తించి వారికి ఓటు వేయాలని  విజ్ఞప్తి చేశారు.

click me!