తమిళిసైతో ముగిసిన సబితా ఇంద్రారెడ్డి భేటీ.. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి

By Siva KodatiFirst Published Nov 10, 2022, 9:23 PM IST
Highlights

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఆమెకున్న సందేహాలను సబితా ఇంద్రారెడ్డి , అధికారులు నివృత్తి చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో రాజ్‌భవన్‌లో బిల్లుల పెండింగ్ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రధానంగా కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వ్యవహారంపై గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సమావేశమై వివరణ ఇచ్చారు. ఆమెకున్న సందేహాలను సబితా ఇంద్రారెడ్డి నివృత్తి చేశారు. యూజీసీ నిబంధనలు, న్యాయపరమైన రిజర్వేషన్ల అంశాలను తమిళిసై ప్రస్తావించారు. నిబంధలను పాటిస్తున్నామని.. ఎలాంటి ఇబ్బందులు ఉండవని సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. 

కాగా... తెలంగాణ యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు 2022  బిల్లుపై  చర్చించేందుకు రావాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రిని  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. అయితే ఈ విషయమై నాలుగైదు రోజులుగా వివాదం సాగుతుంది. తమకు సమాచారం ఇవ్వలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అయితే సెప్టెంబర్ లోనే మేసేంజర్ ద్వారా ఈ విషయమై సమాచారం పంపినట్టుగా రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి. ఈ  విషయాలపై తెలంగాణ గవర్నర్ నిన్న మీడియా  సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.  

ALso REad:నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారేమో... ఫాంహౌస్‌ కేసులో రాజ్‌భవన్‌ను లాగాలనే : తమిళిసై సంచలన వ్యాఖ్యలు

బిల్లుల్ని సమగ్రంగా పరిశీలించేందుకు సమయం తీసుకున్నానని అన్నారు. బిల్లుల్ని తానే ఆపానని తప్పుగా అర్ధం చేసుకున్నారని తమిళిసై వ్యాఖ్యానించారు. ఒక్కొక్క బిల్లుని కూలంకషంగా పరిశీలిస్తున్నానని.. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లుకే తొలి ప్రాధాన్యత ఇచ్చానని గవర్నర్ స్పష్టం చేశారు. 

యూనివర్సిటీల్లో నియామకాల బిల్లును తాను ఆపుతున్నట్లు ప్రచారం చేశారని.. ఒక బోర్డు ఉండగా కొత్త బోర్డు ఎందుకని ఆలోచించానని తమిళిసై తెలిపారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని తానే డిమాండ్ చేస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. దానికి తానేదో బిల్లుల్ని ఆపానని ప్రచారం చేశారని తమిళిసై ధ్వజమెత్తారు. ఇప్పటికే అన్ని యూనివర్సిటీ వీసీలతో మాట్లాడానని.. సమగ్ర నివేదిక రూపొందించి, ప్రభుత్వానికి పంపించానని గవర్నర్ వెల్లడించారు. కొత్తగా రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఎందుకు.. అన్నదే తన ప్రశ్న అని ఆమె స్పష్టం చేశారు. 

ఎనిమిదేళ్లుగా వీసీ పోస్టులు ఖాళీగా వున్నాయని.. తన టూర్ ప్లాన్‌కు సంబంధించి అన్ని వివరాలు ప్రభుత్వానికి పంపానని గవర్నర్ వెల్లడించారు. తాను వెళ్లినప్పుడు కలెక్టర్ ,ఎస్పీ రాలేదని ఆమె తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడదని తమిళిసై ప్రశ్నించారు. రాజ్‌భవన్ .. ప్రగతి భవన్‌లా కాదని ఆమె స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌కు ఎవరైనా రావొచ్చు.. సమస్యలు చెప్పుకోవచ్చునని గవర్నర్ తెలిపారు. 

click me!