జగన్ అక్రమాస్తుల కేసు.. తనను తప్పించాలంటూ సబిత పిటిషన్

By telugu news teamFirst Published Jul 7, 2021, 8:41 AM IST
Highlights

సీబీఐ మొదట దాఖలు చేసిన అభియోగ పత్రంలో తనను నిందితురాలిగా చేర్చలేదన్నారు. కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోయినా... తనను నిందితురాలిగా చేర్చుతూ.. అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసిందని పేర్కొన్నారు. 

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో పెన్నా కేసులో తెలంగాణ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఈ కేసు నుంచి తనను తప్పించాలంటూ  సబితా ఇంద్రారెడ్డి... సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు వేశారు.

పెన్నా సిమెంట్స్ కు గనుల లీజు కేటాయింపులు నిబంధనల ప్రకారమే జరిగాయని... ఈ కేసులో అక్రమంగా ఇరికించారని పేర్కొన్నారు. సీబీఐ మొదట దాఖలు చేసిన అభియోగ పత్రంలో తనను నిందితురాలిగా చేర్చలేదన్నారు. కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోయినా... తనను నిందితురాలిగా చేర్చుతూ.. అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసిందని పేర్కొన్నారు. 

కాగా... దీనిపై సీబీఐ కోర్టు కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ తరపు న్యాయవాదులు చెప్పడం గమనార్హం. దీంతో... సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి బీఆర్ మధుసూదనరావు విచారణను ఈ నెల 13కి వాయిదా వేశారు.

ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్‌ అధికారి ఎం. శామ్యూల్‌ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌లో సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. రెవెన్యూ శాఖ కార్యదర్శిగా ఆయన పాత్ర ముఖ్యమని తెలిపింది. ఇవే కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న పయనీర్‌ హాలిడే రిసార్ట్స్‌, పీఆర్‌ ఎనర్జీ సంస్థలు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లలో కౌంటర్లు వేయడానికి గడువు కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరారు.

click me!