తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ తీరుపై కాంగ్రెస్ అసంతృప్తి: భట్టితో మంత్రి ప్రశాంత్ రెడ్డి భేటీ

Published : Mar 07, 2022, 05:19 PM IST
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ తీరుపై కాంగ్రెస్ అసంతృప్తి: భట్టితో మంత్రి ప్రశాంత్ రెడ్డి భేటీ

సారాంశం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీరుపై సీఎల్పీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇవాళ శాసనసభలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆ పార్టీ తీవ్రంగా తప్పు బట్టింది. 

హైదరాబాద్: Telangana అసెంబ్లీ స్పీకర్ Pocharam Srinivas Reddy తీరును CLP తప్పు బట్టింది. ఈ విషయమై BACసమావేశానికి  వెళ్లకుండా Congress ఎమ్మెల్యేలు ఉండడంతో  సీఎల్పీ నేత Bhatti Vikramarka తో తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి  Vemula Prashanth Reddy భేటీ అయ్యారు. బీఏసీ సమావేశానికి రావాలని భట్టి విక్రమార్కను ప్రశాంత్ రెడ్డి కోరారు.

తెలంగాణ అసెంబ్లీలో మంత్రి Harish Rao బడ్జెట్ పై ప్రసంగం చేస్తున్న సమయంలో   సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సభలో లేచి నిలబడ్డారు. పాయింట్ ఆర్డర్ ను లేవనెత్తే ప్రయత్నం చేశారు. అయితే  తాను పదే పదే స్పీకర్ ను కోరుతున్నా కూడా స్పీకర్ తన వైపు చూడలేదని భట్టి విక్రమార్క చెప్పారు. అసెంబ్లీ జరిగే తీరు ఇది కాదని తాను చెప్పేందుకు ప్రయత్నం చేస్తే స్పీకర్ వైపు నుండి సహకారం లభించలేదని విక్రమార్క తెలిపారు.. దీంతో తాము సభ నుండి వాకౌట్ చేశామన్నారు. 

స్పీకర్ తీరును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పు బట్టారు. Assembly మీడియా పాయింట్ వేదికగా స్పీకర్ తీరుపై విమర్శలు చేశారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం ప్రారంభమైంది. బీఏసీ సమావేశం ప్రారంభానికి ముందుగా కూడా స్పీకర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ తో సమావేశమై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం ప్రారంభానికి ముందుగా ఈ విషయం తెలుసుకొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు.  

స్పీకర్ వ్యవహరశైలిపై మంత్రికి  భట్టి విక్రమార్క వివరించారు. అయితే మీ నిరసనను బీఏసీ సమావేశంలో తెలపాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు. అయితే తాము ఐదు రోజులు శాసనసభ సమావేశాలు పొడిగిచంాలని కోరితే ప్రభుత్వం సభ సమావేశాలు పొడిగిస్తారా అని మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu