వేదికపై రోహిత్ రెడ్డి .. రేవంత్ రెడ్డిని గెలిపించాలన్న మంత్రి మహేందర్ రెడ్డి .. అవాక్కైన బీఆర్ఎస్ నేతలు

By Siva Kodati  |  First Published Nov 4, 2023, 9:27 PM IST

ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూర్ బీఆర్ఎస్ అభ్యర్ధి పైలట్ రోహిత్ రెడ్డి, ఇతర నేతలతో కలిసి మహేందర్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో రోహిత్ రెడ్డిని గెలిపించాలని చెప్పబోయి.. పొరపాటున రేవంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని వ్యాఖ్యానించారు.


ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ప్రచారం హాట్ హాట్‌గా జరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీల నుంచి అగ్రనేతలు రంగంలోకి దిగి క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. కొద్దినెలల వరకు బీఆర్ఎస్‌కు పోటీ ఎవ్వరూ లేరనిపించింది. కానీ వరుసగా రెండు సార్లు అధికారంలో వుండటంతో పాటు ప్రజలు మార్పు కోరుకుంటూ వుండటంతో కాంగ్రెస్‌కు సర్వేలన్నీ అనుకూలంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మొదలుకొని బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. గతంలో కాంగ్రెస్ పాలనను రైతుబంధు, ఉచిత విద్యుత్‌పై వారు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. 

ఇలాంటి వేళ ఏ బీఆర్ఎస్ నేతయినా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గెలవాలని కోరుకుంటారా. అలాంటిది ఎమ్మెల్సీ, మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి.. రేవంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అసలేం జరిగిందంటే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూర్ బీఆర్ఎస్ అభ్యర్ధి పైలట్ రోహిత్ రెడ్డి, ఇతర నేతలతో కలిసి మహేందర్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో రోహిత్ రెడ్డిని గెలిపించాలని చెప్పబోయి.. పొరపాటున రేవంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని వ్యాఖ్యానించారు. దీనిని గమనించిన రోహిత్ రెడ్డి ఆయనను వెనుక నుంచి అప్రమత్తం చేశారు. అయితే మహేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

Latest Videos

click me!