తెలంగాణలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు - బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Published : Nov 24, 2022, 10:26 AM IST
తెలంగాణలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు - బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సారాంశం

తెలంగాణ అసెంబ్లీకి మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఎస్పీ కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి పార్టీని బలంగా తయారు చేయాలని సూచించారు. 

తెలంగాణ రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జోస్యం చెప్పారు. బుధవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా సిద్ధిపేట జిల్లాలో ఉన్న బీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 

ఐటీ అధికార్లు ఫోన్లు చేయలేదు: టర్కీ నుండి తిరిగి వచ్చిన మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి

ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. బహుజన్ సమాజ్ పార్టీ కార్యాకర్తలకు, నాయకులకు, శ్రేణులకు 180 రోజుల సమయం మాత్రమే ఉందని అన్నారు. ఆలోపే గ్రామాల్లో, క్షేత్ర స్థాయిలో పర్యటించి, బీఎస్పీని బలపేతం చేసేందుకు పని చేయాలని కోరారు. ప్రతీ ఒక్క కార్యకర్త మరో 55 మందిని కార్యకర్తలుగా తయారు చేయాలని అన్నారు. బీఎస్పీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కాకుండా క్షేత్రస్థాయిలో, గ్రామాల్లో ఉండాలని ఆయన కోరారు. ప్రజల సమస్యలను గవర్నమెంట్ వద్దకు తీసుకెళ్లేందుకు ‘మై బీఎస్పీ టాక్‌ ఇన్‌’అనే వెబ్ సైట్ తయారు చేశామని, అది ఇప్పుడు అందుబాటులో ఉందని అన్నారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేసినా, బెదిరించినా తాను భయపడబోనని స్పష్టం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu