మ‌త‌త‌త్వ‌, విభజన శక్తులతో జాగ్ర‌త్త‌.. ప్రజలకు మంత్రి కేటీఆర్ హెచ్చరికలు

By Mahesh Rajamoni  |  First Published Oct 31, 2023, 5:55 AM IST

Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ లో విచ్ఛిన్నకర శక్తులపై ప్రజలకు మంత్రి కేటీఆర్ హెచ్చ‌రిక‌లు చేశారు. ''శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు మతతత్వ శక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా గత తొమ్మిదేళ్లలో నాలుగు నియోజకవర్గాలు గణనీయమైన పురోగతి సాధించాయని" ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మెరుగైన పాల‌న అందిస్తున్న‌ద‌ని కూడా పేర్కొన్నారు. 
 


Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఊహించ‌ని ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్, బీజేపీల‌ను టార్గెట్ చేస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) ప‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజకీయ లబ్ధి కోసం మతతత్వ శక్తులను ఉపయోగించుకునే విభజన శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ముధోలు, బోథ్, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల ప్రజలకు ఆయ‌న ఈ పిలుపునిచ్చారు. శాంతియుత సంబంధాలను పెంపొందించుకోవాలని, శాంతియుతంగా జీవించాలని కూడా కోరారు.

సోమవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌లో బీజేపీ నిర్మల్ జిల్లా మాజీ అధ్యక్షురాలు పి.రమాదేవిని చేర్చుకున్న అనంతరం జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించేందుకు మతోన్మాద శక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తొమ్మిదేళ్లలో నాలుగు నియోజకవర్గాలు గణనీయమైన ప్రగతి సాధించాయని వివరించారు. తెలంగాణలోని గొప్ప గంగా-జమునీ తహజీబ్ సంస్కృతిని ఎత్తిచూపుతూ, ఇటీవల హైదరాబాద్‌లో గణేష్ విగ్రహ నిమజ్జన ర్యాలీ సందర్భంగా ముస్లిం సమాజం తమ మిలాద్-ఉన్-నబీ వేడుకలను వాయిదా వేసిన సంఘటనను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే జి విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీ పి సతీష్‌, ఇతర నేతలు పాల్గొన్నారు.

Latest Videos

undefined

అంతకుముందు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు దరువు ఎల్లన్నను కేటీఆర్ సాధారంగా  బీఆర్‌ఎస్‌లోకి స్వాగతించారు. పార్టీ వారి సేవలను సముచితంగా ఉపయోగించుకుంటుంది అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్‌, బీజేపీలు చేస్తున్న అన్యాయాన్ని గుర్తించిన పలువురు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. ప్రజాకళాకారులైన గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్‌, రసమయి బాలకిషన్‌ శాసనసభ్యులుగా పనిచేసిన వారికి బీఆర్‌ఎస్‌ ఎప్పుడూ గౌరవం ఇస్తుందని గుర్తు చేశారు.

ముస్లింలు జాగ్రత్తగా ఉండాలనీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వారిని ఓటు బ్యాంకుగా వాడుకోవద్దని బీఆర్ఎస్ హెచ్చరించింది. దశాబ్దాలుగా రెండు పార్టీలు ముస్లింలను ఒకరినొకరు శత్రువులుగా చూపించుకుని తమ రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకున్నాయని కేటీఆర్ విమర్శించారు. సోమవారం ఇక్కడ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారితో జరిగిన సమావేశంలో  కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి ముస్లిం సమాజం తమను తాము రక్షించుకోవాలన్నారు. హైదరాబాద్ లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ ను ఆరెస్సెస్, బీజేపీ ఏజెంట్ అయిన గాడ్సే నడుపుతున్నారనీ, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించి రాష్ట్రంలో శాంతికి విఘాతం కలిగించాలని బీజేపీ కుట్రలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.

click me!