ఫ్రీ డ్రింకింగ్ వాటర్.. డిసెంబర్ నెల బిల్లుకు రాయితీ: కేటీఆర్

By Siva KodatiFirst Published Dec 19, 2020, 5:08 PM IST
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల వేళ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేర‌కు హైదరాబాద్‌లోని ప్ర‌తి ఇంటికీ కొత్త సంవ‌త్స‌రం తొలివారంలో ఉచిత తాగునీటి స‌ర‌ఫ‌రా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తామ‌న్నారు మంత్రి కేటీఆర్

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల వేళ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేర‌కు హైదరాబాద్‌లోని ప్ర‌తి ఇంటికీ కొత్త సంవ‌త్స‌రం తొలివారంలో ఉచిత తాగునీటి స‌ర‌ఫ‌రా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తామ‌న్నారు మంత్రి కేటీఆర్. ఉచిత తాగునీరు పంపిణీపై మంత్రి శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నూత‌న సంవ‌త్స‌ర తొలివారంలో హైద‌రాబాద్‌లో ఉచిత తాగునీటి కార్య‌క్ర‌మం ప్రారంభిస్తామ‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు జ‌ల‌మండ‌లి ద్వారా 20 వేల లీట‌ర్ల వ‌ర‌కు తాగునీరు ఉచితంగా ఇస్తామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

సీఎం న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట మేర‌కు డిసెంబ‌ర్ నెల తాగునీటి వినియోగం 20 వేల లీట‌ర్ల వ‌ర‌కు ఉచితమని ఆయన వెల్లడించారు. ఈ మేర‌కు జ‌న‌వ‌రి నెల‌లో వినియోగ‌దారుల‌కు వ‌చ్చే డిసెంబ‌ర్ నెల బిల్లులో 20 వేల లీట‌ర్ల వ‌ర‌కు ఛార్జ్ చేయొద్ద‌ని అధికారుల‌ను కేటీఆర్ ఆదేశించారు.

ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి ఒక‌ట్రెండు రోజుల్లో విధివిధానాల‌ను సిద్ధం చేయాల‌ని కేటీఆర్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. జల మండలి ద్వారా జరుగుతున్న తాగునీటి సరఫరాపై కూడా సమీక్షించారు.

గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరా చాలా బాగా పెరుగుతూ వస్తొందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు అధికారులు తెలియజేశారు. గత ఐదారు సంవత్సరాలుగా పెద్దఎత్తున చేపట్టిన మౌలిక వసతుల కార్యక్రమాల ద్వారా ఇది సాధ్యమైందని ఈ సందర్భంగా వారు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు.

వచ్చే వేసవికి సైతం సరిపోయే విధంగా నీటి సరఫరా చేసేందుకు ఇప్పటి నుంచే తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. 
 

click me!