నిరాశ లేదు.. 30 సీట్లు ఎక్కువ రావాల్సింది: ఫలితాలపై కేటీఆర్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Dec 4, 2020, 8:39 PM IST
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితం తాము ఆశించిన విధంగా రాలేదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంకో 25 సీట్లు వస్తాయని తాము ఆశించామన్నారు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితం తాము ఆశించిన విధంగా రాలేదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంకో 25 సీట్లు వస్తాయని తాము ఆశించామన్నారు.

ఎన్నికల సరళితో పాటు ఎగ్జిట్ పోల్స్ కూడా టీఆర్ఎస్సే గెలుస్తుందని చెప్పాయని కేటీఆర్ గుర్తుచేశారు. బీఎన్ రెడ్డి కాలనీలో కేవలం 18 ఓట్లు, మౌలాలీలో 200, మల్కాజ్‌గిరిలో 70, అడిక్‌మెట్ ‌200, మూసాపేట్‌లో 100 ఇలా పది పన్నెండు సీట్లలో స్వల్ప తేడాతో టీఆర్ఎస్ ఓటమి పాలైనట్లు మంత్రి పేర్కొన్నారు.

ఫలితాలపై సమావేశం నిర్వహించి సమీక్ష నిర్వహించుకుంటామని కేటీఆర్ తెలిపారు. మేయర్‌పై తొందరెందుకన్న ఆయన.. ఇంకా సమయం వుందని వ్యాఖ్యానించారు. 

Also Read:జీహెచ్ఎంసీలో హంగ్: కింగ్‌ మేకర్‌గా ఎంఐఎం
 

click me!