జీహెచ్ఎంసీలో హంగ్: కింగ్‌ మేకర్‌గా ఎంఐఎం

Siva Kodati |  
Published : Dec 04, 2020, 08:23 PM IST
జీహెచ్ఎంసీలో హంగ్: కింగ్‌ మేకర్‌గా ఎంఐఎం

సారాంశం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు అస్పష్ట తీర్పు ఇచ్చారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. 150 డివిజన్లున్న గ్రేటర్ హైదరాబాద్‌లో 76 మేజిక్ ఫిగర్. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు అస్పష్ట తీర్పు ఇచ్చారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. 150 డివిజన్లున్న గ్రేటర్ హైదరాబాద్‌లో 76 మేజిక్ ఫిగర్.

ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. టీఆర్ఎస్ 56, బీజేపీ 47, ఎంఐఎం 43, కాంగ్రెస్ 2 చోట్ల విజయం సాధించాయి. దీంతో మేయర్ పీఠం చేజిక్కించుకోవాలంటే ఎంఐఎం మద్ధతు తప్పనిసరి. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాలు టీఆర్ఎస్‌ను నిలబెట్టాయి. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించింది.

కుత్బుల్లాపూర్‌లో 8 డివిజన్లలో 7, కూకట్‌పల్లిలో 8 డివిజన్లకు గాను 7, శేరిలింగంపల్లిలో 10 డివిజన్లకు గాను 9, జూబ్లీహిల్స్‌లో 6 డివిజన్లకు గాను 4 చోట్ల టీఆర్ఎస్, 2 చోట్ల ఎంఐఎం గెలుపొందాయి. స్థానికేతరులు ఎక్కువగా వున్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌కు ఆదరణ దక్కింది. 

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు