
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ (Minister KTR) మరోసారి తన ఉదార గుణాన్ని చాటుకున్నారు. ఇంటర్మీడియెట్‌లో మంచి మార్కులతో పాస్ అయిన ఇద్దరు విద్యార్థినుల (Merit Students) పై చదువులకు పేదరికం అడ్డుగా మారింది. ఆ ఇద్దరు అక్కా చెళ్లెళ్లు 95 పర్సెంటేజీ కంటే ఎక్కువ మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులయ్యారు. ఒకరు ఎంబీబీఎస్, మరొకరు బీటెక్ చదవాలని బలంగా నిశ్చయించుకున్నారు. ఆయా కోర్సుల్లో సీట్లు కూడా సంపాదించుకున్నారు. కానీ, హాస్టల్, మెస్ ఫీజుల వంటి పలు ఆర్థిక బంధనాలతో ముందుకు సాగడం కష్టతరంగా మారింది. ఈ విషయం ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వారికి సహాయ హస్తం (Financial Help) అందించారు.
జయశంకర్ భూపాలపల్లికి చెందిన కోతుల రాజమల్లు బీఏ పొలిటికల్ సైన్స్ చదివారు. గతంలో ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేశారు. కానీ, కరోనా కాలంలో ఆయన ఉద్యోగం పోయింది. ప్రస్తుతం దినసరి కూలీగా పని చేసుకుంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 21 ఏళ్ల కావేరి, 18 ఏళ్ల శ్రావణి. వీరిద్దరూ మెరిట్ స్టూండెట్లు. టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్, టీఎస్ మాడల్ స్కూల్స్‌లలో చదివారు. కావేరీ ఇంటర్‌లో 95 శాతం మార్కులతో పాస్ అయ్యింది. సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సులో అడ్మిషన్ పొందింది. కాగా, శ్రావణి కూడా తన ఇంటర్మీడియెట్ 97 శాతం మార్కులతో పాస్ అయ్యింది. ఆంధప్రదేశ్‌లో తాడేపల్లి గూడెంలోని ఎన్ఐటీలో బీ టెక్ (ఈసీఈ) కోర్సులో అడ్మిషన్ పొందింది. వీరిద్దరూ వారి మెరిట్ స్కోరు కారణంగా ఉచితంగా సీట్లు పొందారు. కానీ, వారి హాస్టల్, మెస్ వంటి ఇతర ఫీజులు కట్టలేకపోతున్నారు.
ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలుసుకున్నారు. వారికి ఆర్థిక సహాయం అందించాలని నిశ్చయించుకున్నారు. ఆ ఇద్దరు అక్కా చెళ్లెళ్లకు హెల్ప్ ఆఫర్ చేశారు. దీంతో వారిద్దరూ తండ్రి కోతుల రాజమల్లుతో కలిసి ఈ రోజు హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఆ ఇద్దరు వారి చదువులు పూర్తయ్యే వరకు ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్.. ఆ ఇద్దరు మెరిట్ స్టూడెంట్లతో కలిసి మాట్లాడారు. వారి ఆరోగ్య వివరాలు, అవసరాల గురించి ఆరా తీసి మాట్లాడారు. వారి భవిష్యత్ చదువులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తమకు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చినందుకు, తమ చదువులు పూర్తి చేయడానికి సహకరిస్తున్నందుకు వారిద్దరూ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మహిళా దినోత్సవాన్ని గుర్తు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేటీఆర్ ఈరోజు ప్రశంసలు కురింపించారు. WomensDay2022 (మహిళా దినోత్సవం) రావడానికి మరో మూడు రోజులు మాత్రమే ఉందని తెలిపిన కేటీఆర్.. మహిళల కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, భద్రత & సాధికారత విషయంలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు.
ట్విట్టర్ స్పందించిన మంత్రి కేటీఆర్.. WomensDay2022 (మహిళా దినోత్సవం) రావడానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ! ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహిళల సంక్షేమం, భద్రత & సాధికారత విషయంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను.. మహిళల కోసం తీసుకువచ్చిన గొప్ప చర్యల్లో కేసీఆర్ కిట్స్ ! అంటూ ట్వీట్ చేశారు. మహిళా బంధు కేసీఆర్ అని పేర్కొంటూ హాష్‌ట్యాగ్ జోడించారు.