తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త .. డీఏ విడుదలకు ఈసీ అనుమతి

Siva Kodati |  
Published : Dec 02, 2023, 06:53 PM IST
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త .. డీఏ విడుదలకు ఈసీ అనుమతి

సారాంశం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వారికి డీఏ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అంగీకరించింది.   పలు ఉద్యోగ సంఘాలు కూడా డీఏ విడుదలపై ఈసీకి లేఖ రాశాయి. వీటిపై సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం డీఏ విడుదలకు అనుమతించింది.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వారికి డీఏ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం మూడు డీఏలు పెండింగ్‌లో వున్నాయి. వీటిలో ఒక దానిని విడుదల చేసేందుకు అనుమతి మంజూరు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం ఈసీని కోరింది. అలాగే పలు ఉద్యోగ సంఘాలు కూడా డీఏ విడుదలపై ఈసీకి లేఖ రాశాయి. వీటిపై సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం డీఏ విడుదలకు అనుమతించింది.

ఇప్పటికే పోలింగ్ ముగియడంతో ఈసీ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే డీఏ చెల్లింపులు ఎందుకు ఆలస్యమయ్యాయి.. ఇప్పుడే ఎందుకు విడుదల చేయాల్సి వస్తోందని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన సమాధానం రావడంతో డీఏ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Balapur Ganesh Laddu: హిస్టరీ క్రియేట్ చేసిన బాలాపూర్ లడ్డూ వేలం.. ఎవరు దక్కించుకున్నారో తెలుసా?
Dasara Holidays: దసరా సెలవులు ఎప్పటినుంచో తెలుసా?