రజాకార్ సినిమాపై కేటీఆర్ స్పందన.. బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు, సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామన్న మంత్రి

Siva Kodati |  
Published : Sep 18, 2023, 07:48 PM IST
రజాకార్ సినిమాపై కేటీఆర్ స్పందన.. బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు, సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామన్న మంత్రి

సారాంశం

రజాకార్ సినిమాపై స్పందించారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శాంతి భద్రతలు దెబ్బతినకుండా చూస్తామని .. సినిమాను నిలిపివేయాలని సెన్సార్ బోర్గును కోరతామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 

నిజాం పాలన, అప్పట్లో రజాకార్లు చేసిన అకృత్యాలే ఇతివృత్తంగా తెరకెక్కిన ‘‘రజాకార్’’ సినిమా వివాదాలకు తావిస్తోంది. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు గూడూరు నారాయణ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన టీజర్‌ వివాదాస్పదమవుతోంది. ఓ వర్గాన్ని విలన్‌గా చూపించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రజాకార్ ట్రైలర్ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశాడో వ్యక్తి. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ట్రైలర్ వుందని ఫిర్యాదు చేశారు. ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. మత హింసను ప్రేరేపించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు దెబ్బతినకుండా చూస్తామని మంత్రి తెలిపారు. సినిమాను నిలిపివేయాలని సెన్సార్ బోర్గును కోరతామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Railway Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. పదో తరగతి అర్హతతో 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు, తెలుగులోనే ఎగ్జామ్
Sankranti Holidays : సంక్రాంతి సెలవులు మరో రెండ్రోజులు పొడిగిస్తారా..?