తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు .. దివ్యాంగుల పింఛన్ రూ.6016కు పెంచుతాం : కేటీఆర్ కీలక ప్రకటన

By Siva Kodati  |  First Published Oct 19, 2023, 3:06 PM IST

కేసీఆర్ మరోసారి అధికారంలోకి రాగానే దివ్యాంగులకు ప్రస్తుతం ఇష్తున్న పింఛన్‌ను రూ.4,016 నుంచి రూ. 6,016కు పెంచుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు . తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.10,300 కోట్లు ఖర్చు చేసినట్లు కేటీఆర్ తెలిపారు.  


అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. నేతల హామీలతో పాటు ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. అలాగే జాతీయ నాయకులు వరుసపెట్టి తెలంగాణకు క్యూ కడుతూ ఇక్కడి అధికార పార్టీ బీఆర్ఎస్‌పై వాడి వేడి విమర్శలు చేస్తున్నారు. వీటికి ఆ పార్టీ నేతలు సైతం కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రాగానే దివ్యాంగులకు ప్రస్తుతం ఇష్తున్న పింఛన్‌ను రూ.4,016 నుంచి రూ. 6,016కు పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. 

గురువారం తెలంగాణ భవన్‌‌లో జరిగిన దివ్యాంగుల కృతజ్ఞత సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. వైకల్యం అనేది శరీరానికే తప్పించి మనసుకు కాదన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.10,300 కోట్లు ఖర్చు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్ 3 నుంచి 4 శాతానికి పెంచినట్లు మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో వున్న కర్ణాటకలో దివ్యాంగులకు పింఛన్ రూ.1100 ఇస్తున్నారని.. అలాంటి తెలంగాణలో ఇస్తుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం రూ.600 నుంచి రూ.1000 మాత్రమే పింఛన్ ఇస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతోందని.. మరి 11 సార్లు ఇస్తే ఏం చేశారని మంత్రి కేటీఆర్ నిలదీశారు. 

Latest Videos

undefined

ALso Read: గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోంది..: కాంగ్రెస్ బస్సు యాత్రపై కేటీఆర్ ఫైర్..

ఇకపోతే.. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు చేపట్టిన బస్సు యాత్రపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. విభజన హామీలపై ఏనాడూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించని రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదని అన్నారు. కాంగ్రెస్ బస్సుయాత్ర.. తుస్సుమనడం ఖాయమని విమర్శించారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అని.. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని ఆరోపించారు. తమ ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉందని.. వారి గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోందని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో కేటీఆర్ పోస్టు చేశారు. 

click me!