హుస్సేన్ సాగర్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం.. వేగంగా ఏర్పాట్లు, 15 నెలల్లో నిర్మాణం

By Siva KodatiFirst Published Sep 9, 2021, 4:04 PM IST
Highlights

హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ ఒడ్డున ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణం ఏడాది నుంచి 15 నెలల్లో పూర్తి చేస్తామన్నారు రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పులు ఈశ్వర్. 

హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ ఒడ్డున ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణం ఏడాది నుంచి 15 నెలల్లో పూర్తి చేస్తామన్నారు రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పులు ఈశ్వర్. గురువారం విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన కొప్పుల.. విగ్రహం, నిర్మాణాలు అంబేడ్కర్ ఖ్యాతిని తెలియజేసేలా ఉంటాయని స్పష్టం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్ల సమన్వయంతో గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. పార్లమెంట్ ఆకారంలో విగ్రహం అడుగున 50 అడుగుల మేర భవంతి ఉంటుందని మంత్రి చెప్పారు. దానిపైన 125 అడుగుల విగ్రహం వస్తుందని కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే రూ.100 కోట్లతో టెండర్లు ఖరారు చేసినట్లు మంత్రి వివరించారు.  

click me!