
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూస్తే బీజేపీకి వణుకు పుడుతుందని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఒక వ్యక్తి స్వార్థం కోసమే మునుగోడు ఉప ఎన్నిక అని విమర్శించారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న బీజేపీకి.. కేసీఆర్ రూపంలో ప్రత్యామ్నాయం కనిపిస్తుందన్నారు. కేసీఆర్ పథకాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయని అన్నారు. ప్రజలకు చెప్పేందుకు బీజేపీ చేసిందేమీ లేదని అన్నారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత టీఆర్ఎస్‌దేనని చెప్పారు.
రైతు బంధు, రైతు బీమా పథకాలతో కేసీఆర్ రైతులకు కేసీఆర్ భరోసా కల్పించామని చెప్పారు. మిషన్ భగీరథతో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాకుండా చర్యలు చేపట్టామన్నారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చామని చెప్పారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పాత్రను బీజేపీ పోషించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు.
మూడేళ్లుగా బీజేపీతో టచ్‌లో ఉన్నానని రాజ్‌గోపాల్ రెడ్డి చెప్పాడని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఎలాంటి సాయం చేయడం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీ బలహీనమవుతోందని అన్నారు. మునుగోడు అభివృద్ది కోసం టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.