జగదీష్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్: నువ్వెంతంటే నువ్వెంతంటూ స్టేజీపైనే వాగ్యుద్ధం

By narsimha lodeFirst Published May 31, 2020, 6:19 PM IST
Highlights

:పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి ల మధ్య మాటల యుద్దం జరిగింది. స్టేజీపై నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దూషించుకొన్నారు.
 


నల్గొండ:పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి ల మధ్య మాటల యుద్దం జరిగింది. స్టేజీపై నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దూషించుకొన్నారు.

నియంత్రిత సాగు విధానంపై నల్గొండ లో ఆదివారం నాడు ప్రజా ప్రతినిధులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రుణ మాఫీ విషయమై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది.

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియంత్రిత సాగు విధానంపై మాట్లాడే సమయంలో ప్రభుత్వం తీరును ఎండగట్టారు. రైతు బంధును కుదించేందుకు నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. 

ఆ తర్వాత మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఈ సమయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకొన్నాడు. దీంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది.రుణమాఫీని పూర్తి చేయలేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వాగ్వాదం చోటు చేసుకొంది.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీని ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సమావేశంలో అడగడం తన హక్కు అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.ఆఫ్ట్రాల్ నీవు ఏమిటి నన్ను అడిగేది అంటూ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటరిచ్చారు.

అసెంబ్లీలో చర్చ పెడితే పారిపోయావు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నావ్ అంటూ మంత్రి జగదీష్ రెడ్డికి కౌంటరిచ్చారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

పీసీసీ చీఫ్ గా ఉండడం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకే ఇష్టం లేదని ఉత్తమ్ పై మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. మంత్రిగా నీవు కొనసాగడం జిల్లాకు దురదృష్టకరమంటూ ఉత్తమ్ మంత్రి జగదీష్ రెడ్డిపై ఆరోపణలు చేశారు.ఇద్దరు నేతల మధ్య స్టేజీ మీద వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.


 

click me!