సరస్వతి అమ్మవారి కిరీటంలో వజ్రం గల్లంతు: విచారణకు మంత్రి ఆదేశం

Published : May 06, 2019, 04:01 PM ISTUpdated : May 06, 2019, 04:02 PM IST
సరస్వతి అమ్మవారి కిరీటంలో వజ్రం గల్లంతు: విచారణకు మంత్రి ఆదేశం

సారాంశం

బాసర సరస్వతి ఆలయంలో అమ్మవారి కిరీటంలో వజ్రం మాయం కావడంపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.


బాసర: బాసర సరస్వతి ఆలయంలో అమ్మవారి కిరీటంలో వజ్రం మాయం కావడంపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటనపై విచారణ జరిపి నివేదికను సమర్పించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను మంత్రి  ఆదేశించారు. బాసర అమ్మవారి కిరీటంలో వజ్రం గల్లంతైన విషయమై మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం నాడు  ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ వజ్రం మాయమైన ఘటనపై బాధ్యులపైచర్యలు తీసుకోవాలని కూడ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ విచారణను వేగంగా పూర్తి చేయాలని ఆయన కోరారు.బాసర ఆలయంలో చోటు చేసుకొంటున్న ఘటనలు వివాదానికి కారణంగా మారుతున్నాయి.

సంబంధిత వార్తలు

బాసర అమ్మవారి కిరీటంలో వజ్రం మాయం


 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం