ఇష్టం వచ్చిన వాళ్లకు దళిత బంధు ఇస్తాం.. మహిళలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం

By Sumanth KanukulaFirst Published Sep 27, 2022, 10:22 AM IST
Highlights

ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి కొందరు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదస్పదంగా మారుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అందడం లేదని ప్రశ్నించినవారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి కొందరు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదస్పదంగా మారుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అందడం లేదని ప్రశ్నించినవారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమకు ఇష్టమొచ్చినవారికి దళిత బంధు ఇస్తామని అన్నారు. వివరాలు.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా నర్సాపూర్ -జి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ చసేందుకు వెళ్లారు. అక్కడ దళిత బంధు గురించి ప్రశ్నించిన మహిళలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘మీకు ఓపిక లేకుంటే మేం ఏం చేయాలి. ఏ ఊకుండమ్మా.. నువ్వు మాట్లాడకు. మా ఇష్టమొచ్చినొళ్లకు ఇచ్చుకుంటాం. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అట్ల.. బయటకు తీసుకుపోండి. పో బయటకు పో.. ’’ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. పది లక్షల రూపాయలు ఇస్తే ఏం చేస్తావో చెప్పాలని ప్రశ్నించారు. మీకు అనుభవం ఏం ఉండి.. ఏం చేసుకుని బతుకుతవో చెబితేనే దళిత బంధు ఇస్తామని చెప్పారు. ఎవరి దగ్గర తిరుగుతున్నారో వాళ్ల దగ్గరికే వెళ్లండి.. వాళ్లే ఇస్తారని అన్నారు. 

ఇటీవల నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా.. కల్యాణ లక్ష్మి పైసలు వస్తలేవని చెప్పిన యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా చిలిపిచెడు మండలం అజ్జమర్రి గ్రామంలో ఆసరా పెన్షన్, బతుకమ్మ చీరలను పంపిణీ చేయడానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి కల్యణా లక్ష్మి గురించి చెబుతుండగా.. అక్కడ ఉన్న ఓ యువకుడు.. ‘‘పైసలు వస్తవలేవు.. చాలా మందికి రాలేదు’’ అని అన్నారు. దీంతో అతడిని వెంటనే లోపల వేయాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అక్కడున్న పోలీసులకు చెప్పారు. 

click me!