నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్‌ను పరామర్శించిన మంత్రి హరీష్ రావు..

Published : Sep 27, 2022, 12:45 PM IST
నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్‌ను పరామర్శించిన మంత్రి హరీష్ రావు..

సారాంశం

నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్‌ను తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. మంగళవారం ఆయన ఇంటికి వెళ్లిన మంత్రి హరీష్ రావు.. అరోగ్య వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు.   

నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్‌ను తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన డాక్టర్ మనోహర్.. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు. దీంతో హరీష్ రావు మంగళవారం డాక్టర్ మనోహర్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన అరోగ్య వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు మంత్రి హరీష్ రావు సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇక, ఇటీవల డాక్టర్ మనోహర్‌కు గుండె నొప్పి రావడంతో ఆయన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే నిమ్స్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన.. చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. డాక్టర్ మనోహర్ తీరు నిమ్స్‌కు చెడ్డ పేరు వస్తుందని కొందరు ఉద్యోగులు చెప్పారు. ప్రతిపక్షాలు కూడా డాక్టర్ మనోహర్ తీరుపై విమర్శలు చేశాయి. 

అనారోగ్యంతో బాధపడుతున్న డాక్టర్ మనోహర్‌ను సెలవులో ఉండటంతో.. ఆయన స్థానంలో డీన్‌గా పనిచేస్తున్న డాక్టర్ రామ్మూర్తికి  డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. 

PREV
click me!

Recommended Stories

క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవంలో వెంకయ్య నాయుడు పవర్ ఫుల్ స్పీచ్ | Venkaiah Naidu Powerful Speech
నేను సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు హార్డ్‌వేర్ కూడా.. రేవంత్ రెడ్డి KTR స్ట్రాంగ్ కౌంటర్ | Asianet Telugu