ఆయనది ఐరెన్ లెగ్.. ఎక్కడ అడుగుపెట్టినా కాంగ్రెస్ అడ్రస్ గల్లంతే : రాహుల్‌పై హరీశ్ సెటైర్లు

Siva Kodati |  
Published : Apr 29, 2022, 05:39 PM IST
ఆయనది ఐరెన్ లెగ్.. ఎక్కడ అడుగుపెట్టినా కాంగ్రెస్ అడ్రస్ గల్లంతే : రాహుల్‌పై హరీశ్ సెటైర్లు

సారాంశం

కాంగ్రెస్, బీజేపీలపై ఫైరయ్యారు మంత్రి హరీశ్ రావు. రాహుల్ గాంధీ ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ గల్లంతేనని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో పంటల సమృద్ధిని చూసి కేంద్రానికి కడుపుమంటగా ఉందని హరీశ్ రావు దుయ్యబట్టారు  

రాహుల్ గాంధీది (Rahul gandhi) ఐరెన్ లెగ్ అంటూ సెటైర్లు వేశారు  టీఆర్ఎస్ నేత (trs) , మంత్రి హరీశ్ రావు (harish rao) . రాహుల్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ అడ్రస్ గల్లంతేనని ఆయన దుయ్యబట్టారు. రాహుల్ ఎక్కడ అడుగుపెట్టినా 94 శాతం కాంగ్రెస్ ఓడిందని హరీశ్ అన్నారు. 

రాష్ట్రంలో పండుతున్న ధాన్యాన్ని చూసి కేంద్ర మంత్రులే ఆశ్చర్యపోతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాల వల్లే ధాన్యం ఈ స్థాయిలో పండుతోందని.. రాష్ట్రంలో పంటల సమృద్ధిని చూసి కేంద్రానికి కడుపుమంటగా ఉందని హరీశ్ రావు దుయ్యబట్టారు. జాకోరా లిఫ్ట్‌ను చూసి విపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని విమర్శించారు. నిజాం నవాబులు కట్టిన ప్రాజెక్టులు తప్ప ఏడు దశాబ్దాల్లో గత ప్రభుత్వాలు కట్టినవి ఏవీ లేవని హరీశ్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ (congress) అధికారంలో ఉన్నప్పుడు కరెంటు, ఎరువుల కొరత ఉండేదని ఆయన గుర్తుచేశారు. దానికోసం రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేసే పరిస్థితులు ఉండేవని హరీశ్ అన్నారు. ఇప్పుడు వ్యవసాయానికి 24 గంటల పాటు కరెంటు ఉచితంగా ఇస్తున్నామని, ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని మంత్రి చెప్పారు. గతంలో వర్షం కోసం రైతులు ఎదురుచూసేవారని, ఇప్పుడు కాళేశ్వరం, సింగూరు వంటి ప్రాజెక్టులతో ఆకాశం వైపు చూసే పరిస్థితిలేదని హరీశ్ రావు తెలిపారు. 

బీజేపీ (bjp) ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూడటమే బీజేపీ పని అని హరీశ్ రావు విమర్శించారు. నరేంద్ర మోడీ (narendra modi) పాలనలో బుల్లెట్‌ రైలు రాలేదు కానీ.. ఉన్న రైళ్లను, రైల్వే స్టేషన్లను అమ్ముతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎందుకు నింపడంలేదని హరీశ్ రావు ప్రశ్నించారు. నష్టాలను సాకుగా చూపి ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్న బీజేపీ సర్కార్‌ పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలకు రూ.11 లక్షల కోట్లు మాఫీ చేసిందని ఆరోపించారు. 
 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్