తెలంగాణలో ప్రతి ఒక్కరికి బిపి, షుగర్ పరీక్షలు: వైద్యమంత్రి హరీష్ ప్రకటన

By Arun Kumar PFirst Published May 17, 2022, 5:40 PM IST
Highlights

వరల్డ్ హైపర్ టెన్షన్ డే ను పురస్కరించుకొని కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో Gleneagles Global Hospitals 9000 మందిపై చేసిన సర్వే ఫలితాలను మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు.

హైదరాబాద్: రానున్న రెండు మూడు నెలల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బిపి, షుగర్ టెస్ట్ చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఇందుకోసం 33 కోట్ల రూపాయల   నిధులు కూడా కేటాయించామని తెలిపారు.  ఉచితంగా మందులు ఇస్తామని... ఈ మందులు వాడుతున్నారా లేదా అని తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసామన్నారు. ఇండియాలో ఎన్సిడి స్క్రీనింగ్ లో తెలంగాణ 3 స్థానంలో ఉందని... రానున్న 3,4 నెలలు మొత్తంగా పూర్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలోకి తీసుకు వస్తామన్నారు. 

వరల్డ్ హైపర్ టెన్షన్ డే ను పురస్కరించుకొని కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో Gleneagles Global Hospitals 9000 మందిపై చేసిన సర్వే ఫలితాలను మంత్రి హరీశ్ రావు తాజ్ డెక్కన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... వ్యాధి పట్ల అవగాహన కల్పించడం కోసం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా హైపర్ టెన్షన్ డే ని నిర్వహించడం జరుగుతుందన్నారు. సిఎస్ఐ వారు ఇచ్చిన సర్వే ఫలితాలు కొంత ఆశ్చర్యం, బాధను కల్గిస్తున్నాయన్నారు.

''నిమ్స్ లో చేసిన సర్వే ప్రకారం ఎవరతే కిడ్నీ సమస్యలు ఉన్నారో వారిలో 60 శాతం మందికి హైపర్ టెన్షన్ ఉంది. బిపి, షుగర్ ని ముందుగా గుర్తించి జాగ్రత తీసుకోకపోతే వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. లైఫ్ స్టైల్స్ మార్పులు వలన ఈ సమస్యలు వస్తున్నాయి. ప్రజలు తమ ఆరోగ్యం పట్టించుకోకుండా తీవ్రమైన ఒత్తిడి గురవుతున్నారు. ఇంతకు ముందు శారీరకంగా శ్రమ ఉంటుండే ఇప్పుడు నో ఫిట్ నెస్. ఆహారం అలవాట్లు బాగా మారిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యని గుర్తించి ఎన్ సి డి స్క్రీనింగ్ చేస్తున్నాం. 90 లక్షలు మందికి స్క్రీనింగ్ చేసాం. తమ స్క్రీనింగ్ లో 13 లక్షలు మందికి హైపర్ టెన్షన్ వున్నట్లు బయటపడింది'' అని హరీష్ తెలిపారు. 

''పోస్ట్ కోవిడ్ ద్వారా హైపర్ టెన్షన్ కొంత పెరిగినట్టు కనిపిస్తుంది. ప్రజలు ఫిజికల్ యాక్టివిటీ ని పెంచాలి. పిల్లలకు వెల్త్ కాదు హెల్త్ ఇవ్వాలి తల్లితండ్రులు. చిన్న పిల్లలకు కూడా కిడ్నీ సమస్యలు ఉంటున్నాయి'' అంటూ హరీష్ ఆందోళన వ్యక్తం చేసారు. 

''హైదరాబాద్ నగరం మొత్తం సర్వే చేస్తాం. 350 బస్తి దవఖానల్లో ద్వారా 57 టెస్ట్ లో చేస్తున్నాం. వచ్చే నెల నుంచి 120 పైగా టెస్ట్ లో చేయనున్నాం. ఈ రిపోర్ట్స్ ని పేషెంట్, డాక్టర్లకు మొబైల్ ద్వారా 24 గంటల్లో పంపిస్తున్నాం. 45 సంవత్సరాలు దాటినా వారిలో బిపి ,షుగర్ టెస్టులను చేయించుకోవాలని కోరుతున్నాం'' అని హరీష్ రావు తెలిపారు. 

click me!