‘మీ ఆరోగ్యం జాగ్రత్త.. అలా చేయకండి..’ అభిమాని లేఖకు మంత్రి హరీష్ రావు ఫిదా..

By SumaBala BukkaFirst Published Oct 8, 2022, 1:29 PM IST
Highlights

అత్యవసర పరిస్థితి అయినా ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగొద్దంటూ ఓ అభిమాని రాసిన లేఖకు ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు ఫిదా అయ్యారు. 

సిద్దిపేట : హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్య బాధ్యతలు చూసే ఆరోగ్య శాఖా మంత్రిగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. ప్లాస్టిక్ వాడకంతో భయంకరమైన కేన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని వారిని జాగృతం చేస్తున్నారు. అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో.. మరో మార్గం లేక మంత్రి కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ దప్పిక తీర్చుకునే అత్యవసర పరిస్థితి ఏర్పడుతోంది. దీన్ని గుర్తించిన హరీష్ రావు వీరాభిమాని ఒకరు..మంత్రి ఆరోగ్యం గురించి శ్రద్ద వహించాలి అంటూ శుక్రవారం దుబ్బాక పర్యటనలో ఆయనకు ఓ లేఖను అందించారు.

మీ ఆరోగ్యమే మాకు మహాభాగ్యం.. మీరు తప్పనిపరిస్థితుల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడుతున్నారని, ఈ నీరు తాగడం వల్ల భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని అన్నారు. ఇటీవల అంతర్జాతీయ ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ విమల్ సోమేశ్వర్ ఇంటర్వ్యూలో చెప్పారు అని లేఖలో వివరించారు. దయచేసి ఇకపై కాపర్ వాటర్ బాటిల్ వినియోగించాలని.. మంత్రికి దుబ్బాక పరిధి మల్లయ్యపల్లికి చెందిన ఎంబీఏ విద్యార్థి లేఖ అందించాడు. ప్రవీణ్ రాసిన లేఖను చదివి తన ఆరోగ్యం పట్ల ఎంతో తపనతో రాశాడు అంటూ ఫిదా అయ్యాడు మంత్రి హరీష్ రావు. ప్రవీణ్ కు ప్రత్యేకంగా ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

తల్లీబిడ్డలపై కత్తులతో దాడి కేసును చేధించిన పోలీసులు.. ఆస్తికోసం కన్నకూతురే ప్లాన్ చేసి మరీ..

click me!