కాంగ్రెస్‌, బీజేపీలు కుమ్మక్కు.. ఓడినా, గెలిచినా టీఆర్ఎస్‌కు ఒకటే: హుజురాబాద్ ఫలితంపై హరీశ్‌రావు

By Siva KodatiFirst Published Nov 2, 2021, 7:29 PM IST
Highlights

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల (huzurabad bypoll) ఫ‌లితాల నేప‌థ్యంలో ప్ర‌జాతీర్పును శిర‌సావ‌హిస్తామన్నారు టీఆర్ఎస్ (trs) నేత, మంత్రి హరీశ్ రావు (harish rao).   దేశంలో ఎక్క‌డా లేనివిధంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ (congress), బీజేపీలు (bjp)క‌లిసి ప‌నిచేశాయని హరీశ్ ఆరోపించారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓట‌మితో కుంగిపోదు.. గెలిచిన‌నాడు పొంగిపోలేదని, ఓడినా.. గెలిచినా టీఆర్ఎస్ తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షాన ఉండి ప‌నిచేస్తుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. 

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల (huzurabad bypoll) ఫ‌లితాల నేప‌థ్యంలో ప్ర‌జాతీర్పును శిర‌సావ‌హిస్తామన్నారు టీఆర్ఎస్ (trs) నేత, మంత్రి హరీశ్ రావు (harish rao).  ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓట‌ర్లంద‌రికీ ఆయన పేరుపేరున క్ర‌త‌జ్ఙ‌త‌లు తెలిపారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ కార్య‌క‌ర్త‌ల‌కు హరీశ్ రావ్ ధన్య‌వాదాలు తెలిపారు.  టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమీ త‌గ్గ‌లేదని..  అయితే, దేశంలో ఎక్క‌డా లేనివిధంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ (congress), బీజేపీలు (bjp)క‌లిసి ప‌నిచేశాయని హరీశ్ ఆరోపించారు. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లు కూడా చెబుతున్నారని ఆయన గుర్తుచేశారు. జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర స్థాయిలో కుమ్మ‌క్కు కావ‌డాన్ని రాష్ట్ర ప్ర‌జలంతా గ‌మ‌నిస్తున్నారని హరీశ్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓట‌మితో కుంగిపోదు.. గెలిచిన‌నాడు పొంగిపోలేదని, ఓడినా.. గెలిచినా టీఆర్ఎస్ తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షాన ఉండి ప‌నిచేస్తుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. 

అంతకుముందు హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr) స్పందించారు. హుజురాబాద్‌లో పార్టీ కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు కేటీఆర్ కృతజ్ఞతలు, ప్రశంసలు తెలిపారు. టీఆర్‌ఎస్ సోషల్ మీడియా వారియర్స్ అలుపెరగకుండా పోరాటం చేశారని.. వారికి ధన్యవాదాలు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. గత 20 ఏళ్లలో టీఆర్‌ఎస్‌ ఎన్నో ఎత్తు పల్లాలను చూసిందన్న కేటీఆర్.. ఈ ఒక్క ఎన్నిక(హుజురాబాద్) ఫలితం అంతా ఇంపార్టెంట్ కాదన్నారు. ఎన్నికల్లో ఉత్సాహంగా పోరాడిన గెల్లు శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు భవిష్యత్ పోరాటల్లో మరింత దృఢ సంకల్పంతో పని చేయాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:Huzurabad Bypoll Result: నిలబడ్డాడు.. కలబడ్డాడు.. ఈటల గెలుపు వెనుక..!

కాగా.. మొన్న ముగిసిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.....ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన  పోలింగ్ సాయంత్రం ఏడు గంటల వరకు జరిగింది. హుజురాబాద్ నియోజకవర్గం లో 306 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసారు.. నియోజకవర్గం లోని ఐదు మండలాలలో మొత్తం 2,37,036 ఉండగా పురుషులువ1,17,933 కాగా స్త్రీలు 1,19,102 ఉండగా ఇతరులు ఒక్క ఓటరు ఉన్నారు..ఇక హుజురాబాద్ ఉప ఎన్నికలని కోవిడ్ నిబంధనలు అనుసరించి నిర్వహించారు..నియోజకవర్గం లో  144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ కన్నల్ ఇప్పటికే తెలిపాడు..ఉప ఎన్నిక కొసం 421 కంట్రోల్ యూనిట్లు,891 బ్యాలెట్ యూనిట్లు,515 వివి ప్యాడ్ యూనిట్లని వినియోగించారు... మొత్తం 1715 మంది సిబ్బందిని వినియోగించారు..306 పోలింగ్ స్టేషన్ లలో లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహించారు..!

ఈటెల అక్రమాలకు పాల్పడ్డాడనే కారణంతో ఆయనపై సీఎం కేసీఆర్ విచారణ చేపట్టడం... ఆవెంటనే ఈటెల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం... ఆ తరువాత తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.  ఈ నేపథ్యంలో వచ్చిన ఉపఎన్నికల్లో తెరాస తరుఫు నుంచి విద్యార్ధి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉండగా... బీజేపీ నుంచి ఈటెల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచాడు.
 

click me!