కరోనా ఉందంటూ ప్రసవం చేయడానికి నో.. ఆస్పత్రి గేటు వద్దే చెంచు మహిళ డెలివరీ.. హరీశ్ రావు సీరియస్..

By SumaBala BukkaFirst Published Jan 26, 2022, 6:41 AM IST
Highlights

అప్పటికే మహిళకు నొప్పులు తీవ్రమైనప్పటికి నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి వెళ్లాలని విధుల్లో ఉన్న డాక్టర్ హరి బాబు సూచించారు. నొప్పులు ఎక్కువ అవడంతో ఆమె వెంట ఉన్న అక్క చెల్లెల్లు ఇద్దరు ఆస్పత్రి గేటు వద్ద ఓ మూలకు తీసుకెళ్లి పురుడు పోశారు. ఇది గమనించిన వైద్య సిబ్బంది బిడ్డను, తల్లిని ఆస్పత్రిలోకి తీసుకువెళ్లారు. 

అచ్చంపేట  :  Government Hospitalకి పురుటి నొప్పులతో వచ్చినా... సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది నిరాకరించడంతో అక్కడ గేటు వద్దే Chenchu ​​womanకు ప్రసవం అయిన ఘటన Nagar Kurnool జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. జిల్లాలోని బల్మూరు మండలం బాణాలకు చెందిన నిమ్మల లాలమ్మకు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు పురిటి నొప్పులు రావడంతో... కుటుంబ సభ్యులు అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమెకు 10 గంటలకు కరోనా పరీక్షలు చేయించగా, corona positive గా నిర్థారణ అయింది. దీంతో వైద్యులు ప్రసవం ఇక్కడ చేయలేమని.. 
PPE kits కూడా లేవని చెప్పారు. 

అప్పటికే మహిళకు నొప్పులు తీవ్రమైనప్పటికి నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి వెళ్లాలని విధుల్లో ఉన్న డాక్టర్ హరి బాబు సూచించారు. నొప్పులు ఎక్కువ అవడంతో ఆమె వెంట ఉన్న అక్క చెల్లెల్లు ఇద్దరు ఆస్పత్రి గేటు వద్ద ఓ మూలకు తీసుకెళ్లి పురుడు పోశారు. ఇది గమనించిన వైద్య సిబ్బంది బిడ్డను, తల్లిని ఆస్పత్రిలోకి తీసుకువెళ్లారు. ఈ విషయమై ఆసుపత్రి సూపర్డెంట్, గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ కృష్ణను వివరణ కోరగా విధుల్లో ఉన్న వైద్యుడు హరిబాబు బాధితురాలిని జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారని, వారు వెళ్లలేదని చెప్పారు.

హరీశ్ రావు ఆగ్రహం...
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన డ్యూటీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. కరోనా పాజిటివ్ వచ్చిన మహిళకు ప్రసవం చేయడానికి నిరాకరించిన డాక్టర్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పురిటి నొప్పులతో వచ్చిన మహిళలకు పాజిటివ్ ఉన్నా సరే... ఖచ్చితంగా ప్రసవం చేయాల్సిందేనని వైద్యులను ఆదేశించారు. మరోవైపు కరీంనగర్ జిల్లా 100% రెండు డొసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంది. దక్షిణ భారతదేశంలో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న రెండో జిల్లాగా, తెలంగాణలో తొలి జిల్లాగా నిలిచింది. దీనిపై జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. 

ఇదిలా ఉండగా, Uttar Pradesh లో ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (టెట్) రాస్తుండగా ఓ pregnant ladyకి పురిటి నొప్పులు వచ్చాయి. అంబులెన్స్ లో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ పండంటి baby boyకు జన్మనిచ్చింది. ఆస్పత్రి సిబ్బంది పసివాడికి ‘Tet’ అని పేరు పెట్టారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో అమ్రోహా జిల్లాలో జరిగింది. నాన్ పుర్ బిటా గ్రామానికి చెందిన రేణు దేవి.. ప్రబుత్వ ఉపాధ్యాయురాలు కావాలన్న ఆశతో చాలా రోజుల క్రితం టెట్ కు దరఖాస్తు చేసింది.

పరీక్ష సమయానికి ఆమె నిండు గర్భిణి. ఆదివారం టెట్ కు హాజరయ్యేందుకు గజ్రైలాలోని డిగ్రీ కళాశాలకు భర్త సాయంతో వెళ్లింది. exam రాస్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. అప్పమతత్తమైన ఇన్విజిలేటర్ వెంటనే అంబులెన్స్ ను పిలిపించారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ రేణు దేవి.. మగబిడ్డకు జన్మనిచ్చింది. టెట్ పరీక్షకు గుర్తుగా.. వైద్య సిబ్బంది ఆ పిల్లవాడికి టెట్ అని నామకరణం చేశారు. 

click me!