టెన్త్ క్లాస్ పేపర్ లీక్ విషయంలో బీజేపీ నేతల హస్తం ఉందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ విషయమై బండి సంజయ్ పాత్ర ప్రధానంగా ఉందని హరీష్ రావు చెప్పారు.
హైదరాబాద్: టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అంశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి పట్టపగలు దొరికిన దొంగ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బుధవారంనాడు మెదక్ లో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. టెన్త్ క్లాస్ పేపర్ లీక్ చేసింది బీజేపీ కార్యకర్త ప్రశాంత్ అని హరీష్ రావు చెప్పారు. ఈ విషయమై పలువురు బీజేపీ నేతలతో ప్రశాంత్ దిగిన ఫోటోలను హరీష్ రావు మీడియా సమావేశంలో ప్రదర్శించారు. టెన్త్ క్లాస్ లీక్ కేసులో బీజేపీ కుట్రలు నగ్నంగా బటయపడ్డాయన్నారు. పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్ అని ఆయన ఆరోపించారు.
The prime accused in today’s failed attempt to leak 10th class paper leak is a core follower & close aid of Telangana BJP unit 👇
BJP is now playing with lives of students for their politics pic.twitter.com/StuKOrHzK5
కేసీఆర్ ను ఎదుర్కోలేక ఇలాంటివి చేస్తున్నారన్నారు. నిన్న మధ్యాహ్నం టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అయిందని బీజేపీ నేతలు ధర్నా చేశారన్నారు. కానీ, నిన్న సాయంత్రం బీజేపీ కార్యకర్తను విడుదల చేయాలని బీజేపీ నేతలు ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు.
తాండూరు, వరంగల్ లో పేపర్ లీక్ వెనుక బండి సంజయ్ ఉన్నారని ఆయన విమర్శించారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ విషయమై విద్యార్ధులను గందరగోళ పరుస్తున్న విషయంలో తెలంగాణ సమాజానికి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
బీ ఆర్ ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీ పసి పిల్లలతో క్షుద్ర రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. బీజేపీ ఇంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందా అని దేశ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. పేపర్ లీక్ తో భవిష్యత్ తరాలకు బీజేపీ ఏం సందేశం ఇవ్వదలుచుకుందని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయినా బుకాయిస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ కుట్రలను విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు. బీజేపీ కి చదువు విలువ తెలియదన్నారు. బీజేపీ లో చదుకున్నోళ్లు తక్కువని ఆయన సెటైర్లు వేశారు. తాండూరు లో లీకేజీ కి పాల్పడ్డ టీచర్ బీజేపీ ఉపాధ్యాయ సంఘం లో ఉన్నారన్నారు. .నిన్న అరెస్టయిన ప్రశాంత్ బీజేపీ లో ఉన్నారని హరీష్ రావు వివరించారు. ప్రశాంత్ కు బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయని హరీష్ రావు తెలిపారు.
బీజేపీ కి ఈ ఘటనతో సంబంధం ఉందని తేలిపోయిందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా బండి సంజయ్ ను సమర్ధించడం సిగ్గు చేటన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు,, టీఎస్‌పీఎస్ సీ పేపర్ లీకేజీ లో ,ఎమ్మెల్యేల కొనుగోలు లో బీజేపీ కుట్రలు రెడ్ హ్యాండెడ్ గా బయట పడ్డాయని మంత్రి హరీష్ రావు చెప్పారు.
పదో తరగతి ప్రశ్నా పత్రం వాట్సాప్ లో ప్రచారం చేసిన ప్రశాంత్ బీజేపీ కార్యకర్త కాదా అని ఆయన ప్రశ్నించారు. .ప్రశాంత్ ప్రశ్న పత్రాన్ని వాట్సాప్ లో పంపింది నిజమా కాదా చెప్పాలని ఆయన బండి సంజయ్ ను కోరారు.
రెండు గంటల్లో 142 సార్లు నీతో నిందితుడు ఫోన్లో మాట్లాడింది నిజమా కాదా అని హరీష్ రావు అడిగారు. .ప్రశ్న పత్రం వ్యాప్తి లో నీ ప్రమేయం లేకుంటే నీకు నిందితుడు ఇచ్చిన సమాచారాన్ని ఎందుకు దాచావని బండి సంజయ్ ను మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.