హుజురాబాద్ లో కేటీఆర్ బద్దలు బాషింగాలవడం ఖాయం: ధర్మపురి అరవింద్ ఫైర్

Arun Kumar P   | Asianet News
Published : Jun 27, 2021, 02:59 PM IST
హుజురాబాద్ లో కేటీఆర్ బద్దలు బాషింగాలవడం ఖాయం: ధర్మపురి అరవింద్ ఫైర్

సారాంశం

హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో అరవింద్ ఇవాళ(ఆదివారం) పర్యటించారు. 

కరీంనగర్: జమ్మికుంటలో ఎటు చూసిన సీఎం కెసిఆర్ బొమ్మలు, టిఆర్ఎస్ కారు బొమ్మలే వున్నాయని... ఇక్కడే కెసిఆర్ ఓటమి చెందుతున్నారని అర్థమవుతోందని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కేసిఆర్ కు ఓటమి బయం పట్టుకుందని... దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల తరువాత టిఆర్ఎస్ పతనం మొదలైందన్నారు. హుజూరాబాద్ ఎన్నిక తరువాత టిఆర్ఎస్ పేకమేడ లెక్క కూలీ పోతుందని అరవింద్ అన్నారు. 

హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో అరవింద్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు ఈటల అడ్డు వస్తున్నాడని పక్కనపెట్టడం వల్లే ఈ ఎన్నిక వచ్చిందన్నారు. కొడుకు భవిష్యత్ కోసమే కేసీఆర్ ఈటలకు అన్యాయం చేశాడు... కాబట్టి ఈ ఎన్నిక కెసిఆర్ సన్ స్ట్రోక్ వల్ల వచ్చిందని అరవింద్ సెటైర్ వేశారు. 

read more  దళితులపై దాడులు చేయమని టీఆర్ఎస్‌ నేతలకు లైసెన్స్‌లు: బండి సంజయ్ వ్యాఖ్యలు

''కేటీఆర్ ముఖ్యమంత్రి చేయడం కోసం కేసీఆర్ తిప్పలు పడుతున్నారు. ఎన్ని చేసినా కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం కల. ఇప్పుడే అవకాశం ఉంది. మీ అయ్యను ఇప్పుడే కుర్చీ దిగమను. నువ్వు బతిలాడుకో ఇంకా ఏమన్నా చేసుకో ఈ సారి పోతే మల్ల అవకాశం రాదు. ఇది కొడుకు కోసం కెసిఆర్ చేసిన కుట్ర తప్ప మరొకటి కాదు. కరోనా కష్టకాలంలో కొడుకు కోసం ఉద్యమకారునిపై లేని పోని ఆరోపణలు చేశారు'' అని మండిపడ్డారు. 

''నీ కొడుకు కేటీఆర్ ను ఇక్కడ టిఆర్ఎస్ నుంచి పోటి చేయించు. కేటీఆర్ నీకు పౌరుషం ఉంటే నువ్వు ఈటల రాజేందర్ పై పోటి చెయ్యి. అప్పుడు హుజూరాబాద్ ప్రజలు నీ బద్దలు బాషింగాలు చేస్తారు. కెసిఆర్.... నీకు దమ్ము, దైర్యం ఉంటే నీ కొడుకు కేటీఆర్ ను పోటి చేయించు'' అని అరవింద్ సవాల్ విసిరారు. 
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?