కవిత ఖాతాకు రూపాయి రాలేదు, పోలేదు.. మరి ఏ ఎవిడెన్స్‌తో అభియోగాలు : మంత్రి గంగుల వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 11, 2023, 04:09 PM IST
కవిత ఖాతాకు రూపాయి రాలేదు, పోలేదు.. మరి ఏ ఎవిడెన్స్‌తో అభియోగాలు : మంత్రి గంగుల వ్యాఖ్యలు

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. కవితను ఏ ఎవిడెన్స్ కింద విచారిస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. కవిత అకౌంట్ నుంచి ఒక్క రూపాయి పోలేదు.. ఒక్క రూపాయి రాలేదన్నారు. అసలు ఈ కేసు నుంచి కవితను ఏ విధంగా ఇరికిస్తారు , ఏ విధంగా విచారణ చేపడతారంటూ మంత్రి ప్రశ్నించారు. ఎలాంటి డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ లేకుండా విచారణ ఎలా చేపడతారు అని గంగుల నిలదీశారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిని ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని కమలాకర్ దుయ్యబట్టారు. కేవలం ఈడీనే అలాంటి స్టేట్‌మెంట్ రికార్డు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. తాను కవిత బినామీ అని పిళ్లై బయట ఎక్కడా స్టేట్‌మెంట్ ఇవ్వలేదని గంగుల పేర్కొన్నారు. 

అంతకుముందు మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబమే లక్ష్యంగా కేంద్రం దాడులకు దిగిందని ఆరోపించారు. బీజేపీని జనం నమ్మే పరిస్ధితి లేదని మంత్రి పేర్కొన్నారు. ఈడీ విచారణలో కవిత ఏ తప్పు చేయలేదని తేలుతుందని కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు. మోడీకి జై కొడితే ఏ నోటీసులు వుండని.. వ్యతిరేకిస్తేనే నోటీసులని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. 

Also REad: ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు.. బండి సంజయ్‌పై పోలీసు కేసు నమోదు..

అటు కవిత ఈడీ విచారణపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం స్పందించారు. బిజెపి లక్ష్యంగా సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.  దేశంలోని ముస్లింలను ఆర్థికంగా వెలివేయాలని బిజెపి ఎంపీలు పిలుపునిచ్చారని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాదు బిజెపి ఎంపీలు.. ముస్లింలను ఎదుర్కొనేందుకు ప్రజలు తమ ఇండ్లలో ఆయుధాలు పెట్టుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారని ఆరోపణలు గుర్తించారు. కవిత ఈడి విచారణ నేపథ్యంలో మరోమాట రాస్తూ.. కేంద్రంలోని మోడీ సర్కార్ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి..  కక్ష సాధింపులో భాగంగానే కేంద్రం ఇలాంటి ఎత్తుగడలకు  తెరలేపుతోందన్నారు.

ఇక మరోవైపు, ఎమ్మెల్సీ కవిత ఈడి విచారణకు హాజరైన నేపథ్యంలో.. జరగబోయే పరిణామాలపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా  ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఉత్కంఠలో ఉన్నారు. ఈ క్రమంలోనే  తెలంగాణ బిజెపి  అధ్యక్షుడు బండి సంజయ్ కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడి నోటీసులు జారీ చేయడంపై స్పందిస్తూ తెలంగాణ ప్రజల కోసమే కవిత అక్రమ మద్యం డీల్ కు పాల్పడ్డారా అని ప్రశ్నించారు. 

ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బులను.. పంట రుణాల మాఫీకి ఖర్చు చేస్తున్నారా?  లేకపోతే ఉద్యోగులకు  జీతాలు చెల్లించడానికి వాడుతున్నారా? నిరుద్యోగ భృతికి ఏమైనా ఖర్చు చేస్తున్నారా? అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే.. ‘ కవితను అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటారా..’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని లేపింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్