కేసీఆర్‌పై ఉన్న కేసులను విచారించాల్సిందే: బండి సంజయ్

Published : Dec 01, 2022, 05:18 PM IST
కేసీఆర్‌పై ఉన్న కేసులను విచారించాల్సిందే: బండి  సంజయ్

సారాంశం

 కేసీఆర్  పై  ఉన్న  కేసులను విచారించాల్సిందేనని  బీజేపీ తెలంగాణ చీఫ్ బండి  సంజయ్  చెప్పారు. లిక్కర్,డ్రగ్స్ దందా  చేసేవారిని  వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. 

ఆదిలాబాద్: బెంగుళూరు డ్రగ్స్  స్కామ్  కేసును కేసీఆర్  మూసివేయించారని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి  సంజయ్ ఆరోపించారు. ఈ కేసును మళ్లీ విచారించాలన్నారు.ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా  బండి  సంజయ్ ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాలో  పర్యటిస్తున్నారు. ఈ  సందర్భంగా  ఆయన  ఆయా గ్రామాల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్  అమలు చేయలేదన్నారు. ప్రజల సొమ్మును దోచుకుంటూ  కేసీఆర్  రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని  ఆయన  చెప్పారు. లిక్కర్, డ్రగ్స్  దందా  చేసేవారిని  వదిలిపెట్టే ప్రసక్తే లేదని  ఆయన  చెప్పారు.

తెలంగాణ హైకోర్టు  అనుమతి వరకు  ప్రజా సంగ్రామ యాత్రను బండి  సంజయ్  కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని  ముథోల్  అసెంబ్లీ నియోజకవర్గంలో  ఐదో విడత  ప్రజా సంగ్రామ యాత్ర  ప్రారంభించారు. సుమారు  22 రోజుల పాటు  ఈ యాత్ర సాగనుంది.  గత  ఏడాది నుండి బండి  సంజయ్  ప్రజా  సంగ్రామ యాత్రలు  నిర్వహిస్తున్నారు. తొలి విడత  ప్రజా సంగ్రామ యాత్రను చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం  వద్ద ప్రారంభించారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్