ముంపు బాధితులకు అండగా ఉంటాం: మంత్రి ఎర్రబెల్లి

By narsimha lodeFirst Published Aug 16, 2020, 5:09 PM IST
Highlights

ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల సంర‌క్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసినట్టుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

వరంగల్: ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల సంర‌క్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసినట్టుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

ఆదివారం నాడు వరంగల్ నగరంలో వరద ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శించారు. ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకొంటామని మంత్రి తెలిపారు.

ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అంతేకాదు బాధితులకు ఆహారం అందించాలని కోరారు. బాధితులకు అండగా నిలుస్తున్న జాతీయ విపత్తుల నివారణ టీమ్ సభ్యులను మంత్రి అభినందించారు.

ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల సంర‌క్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని ములుగు రోడ్డు, కాశీబుగ్గ‌, ప‌ద్మాన‌గ‌ర్, ఎస్ ఆర్ న‌గ‌ర్, చిన్న‌వ‌డ్డెప‌ల్లి చెరువు, తుల‌సీబార్, కెయు 100 ఫీట్ల రోడ్డు, స‌మ్మ‌య్య న‌గ‌ర్, న‌యీంన‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో మంత్రి దయాకర్ రావు పర్యటించారు.

మంత్రి వెంట ప్ర‌భుత్వ చీఫ్ విప్, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే విన‌య్ భాస్క‌ర్, వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్, వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్, మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావుల‌తో క‌లిసి పర్యటించారు.

మంత్రి వెంట స్థానిక కార్పొరేట‌ర్లు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, వ‌రంగ‌ల్ అర్బ‌న్, రూర‌ల్ జిల్లాల క‌లెక్ట‌ర్లు రాజీవ్ గాంధీ హ‌న్మంతు, హ‌రిత, సంబంధిత శాఖ‌ల అధికారులు ఉన్నారు.


 

click me!