స్వతంత్ర దినోత్సవ వేడుకలు: పి.ఆర్.‌సి.ఐ ఆధ్వర్యంలో వెబినార్

By team teluguFirst Published Aug 16, 2020, 2:58 PM IST
Highlights

పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా , హైదరాబాద్ చాప్టర్  74 వ స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకల సందర్భంగా "ది ఇండిపెండెంట్ ఫ్యూచర్" అనే అంశంపై వెబి‌నార్ నిర్వహించారు. 

స్వాతంత్య్ర  దినోత్సవ  వేడుకలను పురస్కరించుకొని 14 వ తేదీన నిర్వహించిన వెబినార్  “ది ఇండిపెండెంట్ ఫ్యూచర్” లో  యువ  ఔత్సాహికులు  పాల్గొన్నారు.   పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా , హైదరాబాద్ చాప్టర్  74 వ స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకల సందర్భంగా "ది ఇండిపెండెంట్ ఫ్యూచర్" అనే అంశంపై వెబి‌నార్ నిర్వహించారు. 

ఢిల్లీ  పబ్లిక్ స్కూల్ నాచారం  & పి.ఆర్.‌సి.ఐ  కోశాధికారి నోయెల్ రాబిన్ ఈ కార్యక్రమానికి మోడరేటర్ గా వ్యవహరించారు. జీనియస్  సంస్థ  వ్యవస్థాపకులు, ప్రజా సేవకురాలు శ్రీ జహ్నవి గారు , పర్వతారోహకుడు మిస్టర్ అనుప్ కుమార్, యువ  - రోలర్ స్కేట్ అథ్లెట్ జునైరా ఖాన్, తదితరులు పాల్గొన్నారు. 

పి.ఆర్ .సి .ఐ చీఫ్ మెంటర్ జయరాం, పి.ఆర్.సి .ఐ హైదరాబాద్ చాప్టర్ హెడ్ శ్రీమతి.ఆనందితా  సిన్హా, పి.ఆర్.సి.ఐ  నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఫ్రెడరిక్ మైఖేల్ వంటి పబ్లిక్ రిలేషన్స్ ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు. 

శక్తివంతమైన దేశాన్ని నిర్మించడానికి యువ తరం యొక్క సమర్థవంతమైన పాత్రను తెలియజేయవలసిన బాధ్యత పిఆర్.సి.ఐ కి  ఉందని ఈ  సందర్భంగా వక్తలు అన్నారు. యువతకు అపారమైన సామర్థ్యం ఉందని, వారి కలలకు అనుగుణంగా జీవించడానికి సమయం ఉందని పాల్గొన్న గెస్ట్స్ అభిప్రాయపడ్డారు. 

ఈ సందర్భంగా పర్వతారోహకులు శ్రీమతి జాహ్నవి మాట్లాడుతూ.... లక్ష్యాలను సాధించడానికి కృషి, త్యాగం అవసరమని, అన్నారు. పర్వతాలను అధిరోహించడానికి అంకితభావంతో కూడిన ప్రయత్నాల ఆవశ్యకతను ఆమె వివరించింది.  

రోలర్ స్కేట్ అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత అనూప్ కుమార్ యామా మాట్లాడుతూ...  యువత లక్ష్యాలపై దృష్టి పెట్టాలని, వాటిని ఎన్ని కష్టాలెదురొచ్చినా  సాధించడానికి ప్రయత్నించాలని అన్నారు. శ్రీమతి జునైరా ఖాన్ 12 సంవత్సరాల వయస్సులో అతి పిన్న వయస్కుడైన

సమయాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకుని విజయం సాధించాలని  సాఫ్ట్‌వేర్ డెవలపర్ ZM ఇన్ఫోకామ్ CEO  జునైరా ఖాన్  అన్నారు. ఈ  వెబినార్ లో  పాల్గొన్న  వక్తలతో  సభ్యులు సంభాషించారు. 

click me!