యువతిపై పెట్రోల్ దాడి..స్పందించిన మంత్రి ఎర్రబెల్లి

Published : Feb 27, 2019, 12:10 PM ISTUpdated : Feb 27, 2019, 12:21 PM IST
యువతిపై పెట్రోల్ దాడి..స్పందించిన మంత్రి ఎర్రబెల్లి

సారాంశం

హన్మకొండలోని రామ్ నగర్ లో బుధవారం ఓ కాలేజీ యువతిపై ఓ యువకుడు పెట్రోల్ దాడి చేసిన సంగతి తెలసిందే. 

హన్మకొండలోని రామ్ నగర్ లో బుధవారం ఓ కాలేజీ యువతిపై ఓ యువకుడు పెట్రోల్ దాడి చేసిన సంగతి తెలసిందే. ప్రేమకు నిరాకరించిందని.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అటించాడు. కాగా.. యువతికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం యువతి ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. 

కాగా.. ఈ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వరంగల్ జిల్లా అధికారులతో మంత్రి ఎర్రబెల్లి ఫోన్ లో మాట్లాడారు. ఇదిలా ఉండగా.. యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఉన్మాది

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu