ఎన్టీఆర్ నిజమైన రాజకీయ వారసుడు కేసీఆరే..: మంత్రి ఎర్రబెల్లి

By Arun Kumar PFirst Published May 28, 2023, 11:27 AM IST
Highlights

ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా హన్మకొండలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. 

హన్మకొండ : నందమూరి తారక రామారావుకు నిజమైన రాజకీయ వారసుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ బాటలోనే కేసీఆర్ కూడా ప్రజలకు సుపరిపాలన అందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను నెరవేరుస్తూ పరిపాలన వారసుడిగా కేసీఆర్ నిలిచారంటూ మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.    

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు తెలుగురాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నారు. నందమూరి కుటుంబం, టిడిపి నాయకులు, కార్యకర్తలే కాదు ఇతర పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు ఎన్టీఆర్ కు నివాళి అర్పిస్తున్నారు. ఇలా హన్మకొండలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పుష్ఫాంజలి ఘటించి ఘననివాళి అర్పించారు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... విశ్వ విఖ్యాత నటుడిగానే కాదు పరిపాలనాధక్షుడిగా అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని  నిలబెట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అని అన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదల ఆకలి బాధ తీర్చిన గొప్ప సీఎం ఎన్టీఆర్ అన్నారు. అలాగే గూడులేని వారికి ఇళ్లు ఇచ్చిన ఎన్టీఆర్ పేదల పెన్నిధిగా మారారన్నారు ఎర్రబెల్లి.  

Read More  రాజకీయాల్లో ఎన్టీఆర్ నాటిన మొక్కలే నేడు చెట్లయ్యాాయి: ఎన్టీఆర్ కు తలసాని నివాళులు

సినీరంగంలోనే కాదు రాజకీయాల్లోనే అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన ఎన్టీఆర్ ఎందరో యువతకు ఆదర్శంగా నిలిచారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా ఎన్టీఆర్ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. 

click me!