ప్రభుత్వ కార్యాలయాల్లో మిషన్ భగీరథ వాటర్ : ఎర్రబెల్లి

By AN TeluguFirst Published Jan 20, 2021, 4:58 PM IST
Highlights

గజ్వెల్ మండలం కోమటి బండ మిషన్ భగీరథ వద్ద జరిగిన మిషన్ భగీరథ రాష్ట్ర స్థాయి సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందని అన్నారు. 

గజ్వెల్ మండలం కోమటి బండ మిషన్ భగీరథ వద్ద జరిగిన మిషన్ భగీరథ రాష్ట్ర స్థాయి సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందని అన్నారు. 

ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా  ప్రభుత్వ కార్యాలయాల్లో సప్లయ్ చేయడానికి మిషన్ భగీరథ వాటర్ బాటిళ్లను మంత్రి ఆవిష్కరించారు.

అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు అందించినందుకు అధికారులకు కృతజ్ఞతలు. ఆ కృతజ్ఞత సభే ఇది. ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ. 46,120 కోట్లు కేటాయించింది. మూడేళ్లు కష్టపడి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ప్రతి గ్రామానికి అందించాం. 

ఇప్పటి వరకు 27500 గ్రామాలకు దాదాపు 56 లక్షల గృహాలకు నీటిని అందిస్తున్నాం. మిగతా కంపెనీల నీళ్లు బోర్ నీళ్ల ద్వారా తయారుచేసే అమ్ముతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు మాత్రం వర్షం, నదుల నీటి ద్వారా తయారు చేస్తున్నారు. 

కొంతమంది మిషన్ భగీరథ నీళ్లు మంచి నీళ్లు కావని ప్రచారం చేశారు కానీ కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు మిషన్ భగీరథకు దక్కాయి. జలజీవన్ మిషన్ కంటే మిషన్ భగీరథ కార్యక్రమం గొప్పదని కేంద్ర ప్రభుత్వం, అధికారులు పొగిడారు. 

ఈ నీటిని బాటిళ్లు తయారు చేసి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉచితంగా అందిస్తాం. గ్రామాలకు నీటిని అందించేందుకు లక్ష 12 వేల కోట్ల విలువైన పైప్ లైన్ వేయడం జరిగింది’ అని మంత్రి స్పష్టం చేశారు. 
 

click me!