ఉద్యమ ద్రోహులే కేటీఆర్‌ సీఎం కావాలని కోరుకొంటున్నారు: బండి సంజయ్

Published : Jan 20, 2021, 03:24 PM IST
ఉద్యమ ద్రోహులే కేటీఆర్‌ సీఎం కావాలని కోరుకొంటున్నారు: బండి సంజయ్

సారాంశం

 ఉద్యమ ద్రోహులే తెలంగాణ సీఎంగా కేటీఆర్ కావాలని కోరుకొంటున్నారని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చెప్పారు.  

 


అమరావతి:  ఉద్యమ ద్రోహులే తెలంగాణ సీఎంగా కేటీఆర్ కావాలని కోరుకొంటున్నారని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చెప్పారు.

బుధవారం నాడు ఆయన హైద్రాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. నిజమైన ఉద్యమ కారులకు కేటీఆర్ సీఎం కావడం ఇష్టం లేదన్నారు.

కేటీఆర్ ను సీఎం చేయాలని ప్రగతి భవన్ టీవీలు  పగులుతున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు.

మంత్రి ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ లో అన్యాయం జరిగిందన్నారు. టీఆర్ఎస్ లో ఇబ్బంది వచ్చినప్పుడల్లా ఈటలను  ముందు పెట్టి కేసీఆర్ బయటపడుతున్నారని ఆయన ఆరోపించారు.కేటీఆర్ సీఎం అయితే తమ పార్టీకి వచ్చే లాభమేమీ లేదన్నారు. 

అవినీతి మరకలు లేని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొంటామని ఆయన స్పష్టం చేశారు. తన తర్వాతనైనా కేసీఆర్ దళితుడిని సీఎం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.తన కుటుంబం బాగుండాలని కేసీఆర్ పూజలు చేస్తాడని ఆయన చెప్పారు. బీజేపీ చేసే పూజలు సమాజ హితం కోసమని ఆయన తెలిపారు.


 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు