మంత్రి పదవి ఇస్తానని చాలా మంది మోసం చేశారు: ఎర్రబెల్లి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 22, 2019, 11:04 AM IST
మంత్రి పదవి ఇస్తానని చాలా మంది మోసం చేశారు: ఎర్రబెల్లి వ్యాఖ్యలు

సారాంశం

ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు పెద్ద బాధ్యత అప్పజెప్పారన్నారు

ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు పెద్ద బాధ్యత అప్పజెప్పారన్నారు.

గ్రామ పంచాయతీలను అందంగా తీర్చిదిద్దాలని, కొత్త పంచాయతీరాజ్ చట్టంతో గ్రామాల రూపురేఖలు మారుతాయని ఎర్రబెల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో 25 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, ఇంతటి ఆనందరం ఎప్పుడూ కలగలేదన్నారు.

తనను చాలా మంది మోసం చేశారని, ఎన్టీఆర్ మంత్రి పదవి ఇస్తానంటే కొన్ని శక్తులు అడ్డుపడ్డాయని గుర్తు చేశారు. చివరికి చంద్రబాబు కూడా మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారని దయాకర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu