లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోకి... ప్యారడైజ్ బిర్యానీ

Published : Feb 21, 2019, 04:47 PM IST
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోకి... ప్యారడైజ్ బిర్యానీ

సారాంశం

ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ గా పేరొందిన ప్యారడైజ్ బిర్యానీ మరో రికార్డు సాధించింది. 

ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ గా పేరొందిన ప్యారడైజ్ బిర్యానీ మరో రికార్డు సాధించింది. ప్యారడైజ్ బిర్యానీకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది. ఒక సంవత్సరంలో ఎక్కువ మంది వినియోగదారులకు బిర్యానీ అందించినందుకు గాను.. ప్యారడైజ్ కి ఘనత దక్కింది.

ఒక్క సంవత్సరంలో దాదాపు 70లక్షల మంది ప్యారడైజ్ బిర్యానీని రుచి చూశారట. అందుకే లిమ్కా బుక్ ఆఫ్ అవార్డు సొంతం చేసుకోగలిగింది. ఈ అవార్డుతో పాటు బెస్ట్ బిర్యానీ అవార్డు కూడా ప్యారడైజ్ కి లభించింది. ఈ మేరకు ప్యారడైజ్ ఛైర్మన్ అలీ హేమతికి ఆసియా ఫుడ్ కాంగ్రెస్ సంస్థ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ప్రకటించింది.

ఈ సందర్భంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ సిబ్బంది కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. లిమ్కా బుక్ ఆఫ్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!