కేసు తీవ్రత తగ్గిస్తా...ఎంతిస్తావ్: ఎస్సైని పట్టించిన దొంగలు

Siva Kodati |  
Published : Feb 22, 2019, 08:47 AM IST
కేసు తీవ్రత తగ్గిస్తా...ఎంతిస్తావ్: ఎస్సైని పట్టించిన దొంగలు

సారాంశం

లంచం తీసుకుంటూ మహేశ్వరం ఎస్సై ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే... మహేశ్వరం మండలం అమీర్‌పేటకు చెందిన రాజు, మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన నసీర్ ముఠాగా ఏర్పడి పశువులను దొంగిలిస్తున్నారు. 

వాటిని రుద్రారంలోని అల్‌కబీర్ పశువధుశాలలో పనిచేసే హర్షద్‌కు విక్రయిస్తున్నారు. పశువులు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరిపై మహేశ్వరం పోలీసులు దృష్టిసారించారు.

ఈ క్రమంలో రాజు, నసీర్‌లను తన వద్దకు పిలిపించిన ఎస్సై జి. నర్సింహులు... మీపై ఏడు కేసులు ఉన్నాయని.. అయితే కేసు తీవ్రతను తగ్గిస్తానని అందుకు గాను తనకు రూ.1.60 లక్షలు లంచం డిమాండ్ చేశాడు.

అలాగే పశువులను కొనుగోలు చేస్తున్న హర్షద్ పేరు ఎఫ్ఐఆర్‌లో లేకుండా ఉండేందుకు గాను రూ.10 వేలు ఇవ్వాలని ఆదేశించాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించారు. ఇంతకు ముందు రూ.60 వేలు తీసుకున్న నర్సింహులు, గురువారం రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!