వైసీపీ సీనియర్ నేత, మంత్రి అంబటి రాంబాబు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు . ఖమ్మం జిల్లాలో ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైంది . వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది.
వైసీపీ సీనియర్ నేత, మంత్రి అంబటి రాంబాబు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఖమ్మం జిల్లాలో ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. అంబటి రాంబాబు అశ్వారావుపేట వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా.. అదే సమయంలో నాందేడ్ నుంచి విశాఖపట్నానికి గోధుమ బస్తాల లోడుతో ఓ లారీ వెళ్తోంది. ఈ క్రమంలో సత్తుపల్లి శివారులోకి రాగానే.. ఎదురుగా వస్తున్న వాహనంలోని కర్రలు గోధుమల లోడుతో వెళ్తున్న లారీకి బలంగా తగిలాయి. దీంతో రెండు బస్తాలు అంబటి రాంబాబు కారు బానెట్‌పై పడ్డాయి.
ALso Read: నిజం గెలవాలని ఉద్యమం చేస్తే చంద్రబాబు ఇంకా ఇరుక్కుంటారు : భువనేశ్వరి యాత్రపై మంత్రి అంబటి సెటైర్లు
వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం అంబటి రాంబాబు మరో కారులో ఖమ్మం వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాంబాబు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడటంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.