ఓవైసికి తీవ్ర అస్వస్థత...హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

By Arun Kumar PFirst Published Dec 22, 2018, 11:03 AM IST
Highlights

మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యే, శాసనసభాపక్ష నేత అక్బరుద్దిన్ ఓవైసి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నిన్న అర్థరాత్రి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆయన్ని కుటుంబసభ్యులు హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. 

మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యే, శాసనసభాపక్ష నేత అక్బరుద్దిన్ ఓవైసి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నిన్న అర్థరాత్రి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆయన్ని కుటుంబసభ్యులు హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. 

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు డాక్టర్లు తెలిపారు. అక్బరుద్దిన్ అనారోగ్యం గురించి తెలుసుకున్న ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు ఆయన చికిత్స పొందుకున్న ఆస్పత్రి వద్దకు భారీగా  చేరుకుంటున్నారు. అక్బర్ ఆరోగ్యం బాగుపడాలని వారు అల్లాను వేడుకుంటున్నారు. 

గతంలో అక్బరుద్దిన్ పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. కొందరు దుండగులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపడానికి ప్రయత్నించారు. అయితే ఆ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికి ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటినుండి అక్బర్ ఆరోగ్యం పరిస్థితి క్రమక్రమంగా క్షిణిస్తూ వస్తోంది. 

గతంలో దాడి సమయంలో దూసుకుపోయిన కొన్ని తూటాముక్కలు ఇంకా శరీరంలోనే ఉన్నట్లు ఇటీవల ఎన్నికల ప్రచారంలో అక్బర్ వెల్లడించారు. అంతేకాకుండా తన రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయని...నిత్యం డయాలసిస్ చేసుకుంటున్నట్లు తెలిపారు. అందువల్ల ఇవే తాను చివరిసారి పోటీచేసే ఎన్నికలు కావచ్చని అక్బరుద్దిన్ భావోద్వేగానికి లోనయ్యారు. 

click me!