
ఆదిలాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన adialbad gun firing కేసులో ఎంఐఎం అదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ కు కోర్టు life imprisonment శిక్షతో పాటు.. 12 వేల రూపాయల జరిమానా విధించింది, ఈ మేరకు ఆదిలాబాద్ Special Courtన్యాయమూర్తి డా.టి.శ్రీనివాసరావు సోమవారం తీర్పు చెప్పారు. ఏ-2గా ఉన్న ఫిరోజ్ఖాన్, ఏ-3గా ఉన్న ఎండీ హర్షద్ లను నిర్దోషులుగా ప్రకటించారు. దాదాపు 9 నెలల వ్యవధిలోనే ప్రత్యేక కోర్టు అన్ని కోణాల్లో విచారణ జరిపి తీర్పు వెల్లడించింది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2020 డిసెంబర్ 18న పిల్లల ఆటలు తలెత్తిన వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇందులో ఫారుక్ అహ్మద్ ఓ చేతిలో తల్వార్ పట్టుకుని, మరో చేతిలో పిస్తోలుతో కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. ఈ కాల్పుల్లో కౌన్సిలర్ సయ్యద్ జమీర్, మన్నాన్, మోసీన్ లు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే నెల 26వ తేదీన మరణించాడు.
కాగా, 2020 డిసెంబర్ 18న ఆదిలాబాద్ పట్టణంలో కాల్పులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ కాల్పులు జరపడంతో పాటు కత్తితోనూ విరుచుకుపడ్డాడు. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన ఫరూక్ అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు ఫరూఖ్ లైసెన్స్‌డ్ గన్‌తోనే కాల్పులకు తెగబడినట్లు ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు. దీంతో అతని నుంచి తుపాకీ, తల్వార్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు లైసెన్స్ రద్దు చేశామని తెలిపారు. రెండు కుటుంబాల మధ్య పాత గొడవలు.. ఆ రోజు జరిగిన పిల్లల తగాదా.. కాల్పులకు దారి తీసింది. చాలాకాలంగా ఫారుఖ్, మోసిన్ కుటుంబాలు ఒకే పార్టీలో వున్నాయి. అయితే మోసిన్ కుటుంబం టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడంతో వివాదం మొదలైంది.
ఈ క్రమంలో పిల్లలు క్రికెట్ ఆడుతుండగా జరిగిన గొడవ కాల్పుల వరకు వెళ్లింది. ఫారుఖ్ ప్రత్యర్థులను అతి సమీపం నుంచి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఓ యువకుడు పారిపోతుంటే వెంట పడి కాల్చాడు. ఈ గొడవ నేపథ్యంలో ఆదిలాబాద్ ఎంఐఎం శాఖను రద్దు చేస్తున్నట్లు మజ్లిస్ పార్టీ 2020, డిసెంబర్ 19న తెలిపింది. పాత శాఖ స్థానంలో త్వరలోనే కొత్త ఎంఐఎం శాఖను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. డిసెంబర్ 18న ఆదిలాబాద్ ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ ఇద్దరిపై కాల్పులకు తెగబడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.
దీనిని సీరియస్‌గా తీసుకున్న మజ్లిస్ అధినాయకత్వం ఆదిలాబాద్ ఎంఐఎం శాఖను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లా కేంద్రంలోని తాటిగూడలో ఈ తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఎంఐఎం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ రివాల్వర్‌తో స్థానికులను బెంబేలెత్తించాడు. ఫారూఖ్ రెండు రౌండ్లు కాల్పులు జరపగా ఒకరికి తల, మరొకరికి పొట్ట భాగంలో బులెట్లు దూసుకెళ్లాయి. క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.